ఆర్థిక లావాదేవీల్లో మోసాల కట్టడికి, పన్ను ఎగవేతలను సమర్థవంతంగా గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్‌ని బ్యాంకులు ఉపయోగించడానికి కేంద్రం అనుమతించనున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. వ్యక్తిగత లావాదేవీలు వార్షిక పరిమితిని మించిన సమయంలోనూ.. ధృవీకరణ కోసం బ్యాంకులు ఈ విధానాన్ని వినియోగించనున్నట్లు పేర్కొంది.
డిపాజిట్, విత్‌డ్రాల ట్రాకింగ్:
ఇప్పటికే కొన్ని జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు ఈ విధానాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది తప్పనిసరి కానప్పటికీ పాన్ కార్డ్‌ను బ్యాంకు ఖాతాతో జోడించని వినియోగదారులను ఈ పద్ధతిలో అనుసంధానం చేయనున్నారు. ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతాలు ఇప్పటికే అనుసంధానమైనందున.. ఎక్కువ డిపాజిట్లు, విత్‌డ్రాలు చేసే వారిని తేలికగా గుర్తించే అవకాశం ఫేస్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్ ద్వారా లభిస్తుంది.
వివిధ రకాల ఉద్యోగ సమాచారం కావాల్సిన వారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి
https://chat.whatsapp.com/KzhsyPBz4P7LiGxNUaxyj5
0 comments:
Post a Comment