Income Tax | సెక్షన్ 80C కాకుండా ఇతర మార్గాల్లో ట్యాక్స్ భారం తగ్గించుకోవడంపై చాలామంది దృష్టి పెడతారు. ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాలు ఏవంటే...

సెక్షన్ 80C కాకుండా ఇతర మార్గాల్లో ట్యాక్స్ భారం తగ్గించుకోవడంపై చాలామంది దృష్టి పెడతారు. ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాలు ఏవంటే...

NPS అకౌంట్ - సెక్షన్ 80CCD(1B) కింద పన్ను ప్రయోజనాలు

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అకౌంట్ ఉన్నవారు, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80CCD(1B) కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. 

ఈ అకౌంట్ లేనివారు కొత్తగా ఎన్‌పీఎస్ అకౌంట్ తీసుకోవచ్చు. ఉద్యోగులు లేదా స్వయం ఉపాధి మార్గం ఉన్నవారు ఈ సెక్షన్ కింద రూ. 50,000 వరకు అదనపు పన్ను మినహాయింపు పొందవచ్చు. 

సెక్షన్ 80సీ పరిమితి దాటిన సందర్భంలోనే ఈ ప్రయోజనం పొందవచ్చు.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం- సెక్షన్ 80 D

ఈ రోజుల్లో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నారు. కుటుంబసభ్యులు వ్యక్తిగత లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ద్వారా ఆరోగ్య బీమా కవరేజీ పొందడం మంచిది. 


ఇలాంటి హెల్త్ పాలసీ ప్రీమియంపై ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. ప్రస్తుతం 60 ఏళ్లలోపు వారు సెక్షన్ 80 D కింద రూ. 25,000 వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.


ఇంటి అద్దె- సెక్షన్ 80GG


జీతంలో హెచ్‌ఆర్‌ఏ పొందని, అద్దె ఇంటిలో ఉంటున్నవారు సెక్షన్ 80GG కింద అదనపు పన్ను ప్రయోజనం పొందవచ్చు. 


ఈ ప్రయోజనం పరిమితి నెలకు రూ. 5,000 లేదా సంవత్సర ఆదాయంలో 25% లేదా మొత్తం ఆదాయంలో 10% కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించే అద్దెలో ఏది తక్కువ అయితే అంత వరకు ఉంటుంది.


ఎడ్యుకేషన్ లోన్ చెల్లింపులు- సెక్షన్ 80E


ఉన్నత విద్య కోసం రుణం తీసుకున్నప్పుడు విద్యా రుణంపై చెల్లించే వడ్డీపై పన్ను ప్రయోజనం పొందవచ్చు. 


సెక్షన్ 80E కింద క్లెయిమ్ చేయగల వడ్డీపై ద్రవ్య పరిమితి ఉండదు. లోన్ గడువు ముగిసే వరకు లేదా గరిష్టంగా 8 సంవత్సరాలు ఈ ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు.


హోమ్ లోన్ వడ్డీ చెల్లింపు- సెక్షన్ 24


ఒక సంవత్సరంలో హోమ్ లోన్ EMIపై తిరిగి చెల్లించిన ప్రిన్సిపల్ అమౌంట్‌పై సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 


అయితే ప్రధాన మొత్తంపై చెల్లించిన వడ్డీపై సెక్షన్ 24 కింద రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.


డిపాజిట్ల నుంచి వచ్చే ఆదాయం- సెక్షన్ 80 TTB


ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80TTB కింద, డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. 


సెక్షన్ 80 TTB కింద పొందగలిగే గరిష్ట మినహాయింపు పరిమితి సంవత్సరంలో రూ. 50,000 వరకు ఉంటుంది.


కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే మినహాయింపులు వర్తిస్తాయా?

కొత్త పన్ను విధానంలో, పన్ను చెల్లింపుదారులు తక్కువ పన్ను రేట్లను పొందుతారు. అయితే ఇందుకు వీరు చాలా వరకు ఆదాయ పన్ను ప్రయోజనాలను వదులుకోవాల్సి ఉంటుంది.


 కానీ వీరికి కూడా ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80CCD(2) ప్రకారం మినహాయింపు వర్తిస్తుంది.

 సెక్షన్ 80CCD(2) అనేది నోటిఫైడ్ పెన్షన్‌కు సంబంధించినది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి పథకాలకే ఇది వర్తిస్తుంది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆదా చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2022 వరకు మాత్రమే ఉంది. 

అంటే 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి పన్ను ప్రయోజనాలను లెక్కించడానికి ఇంకా మూడు నెలల వరకు మాత్రమే సమయం ఉంది. 

అందువల్ల సెక్షన్ 80సీ పరిమితి దాటితే, ఇతర మార్గాలపై పన్ను చెల్లింపుదారులు దృష్టిపెట్టాలి.

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top