భారతదేశంలో చలికాలం (Winter) కొనసాగుతోంది. ఈసారి ఈ సీజన్‌లో ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతూ చలి తీవ్రత మరింత పెరుగుతోంది.ఇలాంటి తక్కువ ఉష్ణోగ్రతల్లో రక్తనాళాలు ముడుచుకుపోవడం సహజం. దీనివల్ల రక్తపోటు (Blood pressure) పెరుగుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలానే ఛాతీ నొప్పి, హృదయ సంబంధ వ్యాధులు ఉన్న వారికి ఈ సమయంలో శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది ఎదురవుతుంది. ఇంకా ఈ కాలంలో హార్ట్ ఎటాక్స్ బారిన కూడా ఎక్కువమంది పడుతుంటారు. అందుకే శీతాకాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకు పాటించాల్సిన కొన్ని టిప్స్ ఏవో చూడండి. సరైన మోతాదులో ఆహారం
చలికాలంలో వాటర్ తక్కువ తాగడం, ఫుడ్ ఎక్కువ తినడం సర్వసాధారణమని నిపుణులు చెబుతుంటారు. అలానే హెల్దీ ఫుడ్ తినాలనే కోరికలు కూడా ఈ కాలంలో ఎక్కువగా పుడుతుంటాయి. ఈ కోరికలకు లొంగిపోయి మోతాదుకు మించి అనారోగ్యకరమైన ఫుడ్ తింటే ఇబ్బందులు తప్పవు. అందుకని అతిగా ఫుడ్ తినకుండా ఆరోగ్యకరమైన ఫుడ్ మాత్రమే తినేలా ఆహారపుటలవాట్లను అలవర్చుకోవాలి.
* వ్యాయామం
ఈ కాలంలో ఎక్సర్‌సైజులు చేయడం ఎంత కష్టమో అంతే ప్రయోజనకరమని చెప్పవచ్చు. పొద్దున, సాయంత్రం వేళల్లో చలి విపరీతంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో వ్యాయామం చేయక్కర్లేదు. కాస్త చలి తగ్గిన వేళల్లో వాకింగ్, జాగింగ్ వంటి ఏరోబిక్స్ చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలానే శరీరంలో రక్తప్రసరణమెరుగుపరుచుకోవచ్చు. బయటికి వెళ్లలేని వారు ఇండోర్స్‌లో యోగా, డ్యాన్స్, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేస్తూ హార్ట్ హెల్త్‌ను ఫిట్‌గా ఉంచుకోవచ్చు. ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తేనే ఆశించిన స్థాయిలో హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.
* బాడీ టెంపరేచర్
శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రత పడిపోనివ్వకుండా జాగ్రత్త పడాలి. అందుకు పైన చెప్పినట్లు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజులు చేయడంతో పాటు చలికాలానికి తగిన వస్త్రాలను ధరించాలి. ఇందుకు చలి శరీరానికి తగలని స్థాయిలో ఒకదానిపై ఒక డ్రెస్ ధరించవచ్చు.
0 comments:
Post a Comment