Health tips: గుండెపోటు చెప్పే వస్తుంది; గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలివే!!

 మానవ జీవనంలోని జీవనశైలి మార్పుల వల్ల, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది

ఎంతోమంది చిన్న వయసులోనే గుండెపోటు కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏమిటి? వంటి వివరాలను ఈరోజు మనం తెలుసుకుందాం



గుండెపోటు రిస్క్ వీరిలోనే ఎక్కువ

గుండె శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని అందిస్తుంది. అటువంటి గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సహజంగా ఊబకాయం ఉన్న వారికి, మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వ్యాయామం అసలే చేయనివారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో విపరీతంగా కొలెస్ట్రాల్ ఉన్నవారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే

ఇక గుండె పోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, అటువంటి లక్షణాలను గుర్తించి, వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటే తొందరగా గుండెపోటు రాకుండా మనం అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు విషయానికి వస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గా ఉంటుంది. ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది. చిన్న చిన్న పనులకే నీరసంగా అనిపిస్తుంది. కొద్దిగా నడిచినా, ఆయాసం వస్తున్నా గుండె విషయంలో జాగ్రత్త అవసరం అని వైద్యులు చెబుతున్నారు. వెంటనే వైద్యుని సంప్రదించి గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు.

చిన్న చిన్న వాళ్ళను కూడా కబళిస్తున్న గుండెపోటు విషయంలో జాగ్రత్త

ఇక కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడంచెయ్యి లేదా రెండు చేతులలో నొప్పి అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. ఒక్కోసారి శరీరం చచ్చుపడి పోయినట్టు, వాంతి వచ్చినట్టు కూడా ఉండే అవకాశం ఉంది. తల తిరుగుతున్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది . ఇక ఈ లక్షణాలలో ఏది ఉన్నప్పటికీ కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. గతంలో వయసు పెరిగిన పెద్దవాళ్ళకు మాత్రమే వచ్చే గుండె జబ్బులు, ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని సైతం కబళిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా స్త్రీల కన్నా మగవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మగవారు జాగ్రత్తగా ఉండాలి.

గుండె విషయంలో అలసత్వం మంచిది కాదు

విపరీతంగా బరువు ఉన్నా, డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం చేసే వారిలోనూ, వంశపారంపర్యంగా గుండెపోటు చరిత్ర ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ, ఎక్కువ ఒత్తిడి ఉన్నా, శరీరంలో అధికంగా చెడు కొవ్వు ఉన్నప్పటికీ, శారీరక శ్రమ లేక పోయినప్పటికీ గుండెపోటు సమస్య కచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండె విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదు. గుండెజబ్బు వచ్చే ముందు కనిపించే లక్షణాల విషయంలోనూ అజాగ్రత్త చేయకుండా ఏ చిన్న అనుమానం వచ్చినా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే గుండె పోటు ప్రమాదం నుండి కాపాడుకున్న వారమవుతాము.

Disclaimer :ద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. మాత్రమే మీరు వైద్యం సలహాలు పాటించగలరు

ఉపాధ్యాయ వృత్తి సంబంధించిన తాజా సమాచారం కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూపులో చేరండి:

https://chat.whatsapp.com/EmLNZ6OUn3WLdcmV40Dy2o

టెలిగ్రామ్ గ్రూప్ లింక్:

https://t.me/andhrateachers


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top