సోషల్ మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉంటుందంటే అతిశయోక్తి లేదేమో. ఇక్కడ దాదాపు స్మార్ట్ ఫోన్ లేని వారు లేరనే చెప్పుకోవాలి.ఇక స్మార్ట్ ఫోన్ వున్న ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడుతారు. దాంతో ఈ సోషల్ మెసేజింగ్ దిగ్గజం బాగా సొమ్ము చేసుకుంటోంది. ఈ క్రమంలో తమ వినియోగదారులను పెంచుకోవడం కోసం రోజురోజుకీ కొత్త కొత్త అప్డేట్స్ తెస్తూ మరింతమంది వినియోగదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తమ సర్వీస్ లకు ప్రాక్సీ సపోర్టు ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు ఈ గురువారం ప్రకటించింది.
ఈ సరికొత్త Proxy ఫీచర్ వలన వినియోగదారులు ఇంటర్నెట్ అంతరాయం కలిగినా కూడా వాట్సాప్ ని ఉపయోగించడం కొనసాగించవచ్చు అని సమాచారం. వాట్సాప్ సమాచారం ప్రకారం, ప్రాక్సీ ఫీచర్ ఉపయోగించడం వలన ప్రైవసీ మరియు భద్రతకు ఎలాంటి హాని కలుగదు అని తెలుస్తోంది. అలాగే వ్యక్తిగత మెసెజ్ లను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా సురక్షితంగా నిలువ చేయబడతాయి. "ఇంటర్నెట్ షట్డౌన్లు జరిగినప్పుడు కూడా వాట్సాప్ పనిచేసేలా ఈ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది" అని ఓ ప్రకటనలో తెలిపింది.
వాట్సాప్ ఒక బ్లాగ్ పోస్ట్లో తమ అప్డేట్ గురించి మాట్లాడుతూ... 2023 లో మా ఏకైక కోరిక ఏమంటే, ఈ ఇంటర్నెట్ షట్డౌన్లు ఎప్పుడూ జరగకూడదని, ఒకవేళ అలాంటి సంఘటనలు తలెత్తినా కూడా వాట్సాప్ అనేది రన్ కావాలని ఆశ పడుతున్నాం అని, ఈ క్రమంలోనే ఇటువంటి అప్డేట్ తీసుకు రావడం జరిగిందని తెలిపింది. వాట్సాప్లోని స్టోరేజ్ మరియు తేదీ సెట్టింగ్లలోకి వెళ్లడం ద్వారా వినియోగదారులు ఈ కొత్త ఫీచర్ ఆప్షన్ ను చూడవచ్చు. ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రాక్సీ సర్వర్ సపోర్ట్ ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది.
0 comments:
Post a Comment