APSSDC Recruitment | ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు 12న మరో జాబ్ మేళా

 ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 12న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి విజయనగరంలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఖాళీలు, విద్యార్హతల వివరాలు: Deccan Fine Chemicals (India) Pvt.Ltd: ట్రైనీ కెమిస్ట్రీ విభాగంలో 100 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ (కెమిస్ట్రీ)/ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ/ఎంఎస్సీ అనలైటికల్ కెమిస్ట్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.19,477 నుంచి రూ.21,165 వరకు వేతనం ఉంటుంది. ఇంకా ఉచిత ట్రాన్స్పోర్టేషన్, సబ్సిడీ క్యాంటీన్, వసతి సదుపాయం ఉంటుంది. ఎంపికైన వారు తునిలో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 20-27 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. Jayabheri Automobiles Pvt Ltd: ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విజయనగరం , విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 21-35 ఏళ్ల ఉండాలి

ఇతర వివరాలు: - అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు TTDC (Mahila Pranganam), Opp.District Court, BC Colony, Vizianagaram చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. - అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9052057825, 8555832416, 9000102013 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:


ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top