ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా..? ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్.. వంటి ఉన్నత ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారా. అయితే, ఆర్థిక కష్టాల కారణంగా వాటికి దూరమవుతున్నారా! మీకు ఆ చింత క్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనంలో కూడిన ఉచితంగా కోచింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా మీరు మీ కలను నెరవేర్చుకోవచ్చు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఉండాల్సిన అర్హతలేమిటి? నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? విధి విధానాలు ఏమిటి? స్టైఫండ్ ఎలా చెల్లిస్తారు? ఎలాంటి పరీక్షలకు కోచింగ్ తీసుకోవచ్చు? వంటి పూర్తి వివరాలు మీకోసం..
బలహీన వర్గాల సాధికారత కోసం ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి కావాల్సిన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అందిస్తోంది. ఏటా వేల మందికి లబ్ధి చేకూర్చుతున్న ఈ పథకం పేరు.. ‘ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ’ (Free Coaching Scheme for SC and OBC Students) పథకం. ప్రతి ఏడాది ఈ పథకం కింద 3500 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎస్సీలు 70శాతం, ఓబీసీ విద్యార్థులకు 30 శాతం కేటాయిస్తారు. అలాగే, ఈ పథకానికి ఎంపిక చేసే మొత్తం అభ్యర్థుల్లో 60శాతం స్లాట్స్ డిగ్రీ అర్హతతో రాయబోయే పోటీ పరీక్షలకు కేటాయిస్తారు. మిగిలిన 40 శాతం ఇంటర్మీడియెట్ లేదా +2 లేదా 12వ తరగతి అర్హతతో రాయబోయే పోటీ పరీక్షలకు కేటాయిస్తారు. ఈ పథకం కింద పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునే విద్యార్థికి ఫీజు చెల్లించడమే కాకుండా.. ఆ విద్యార్థి సంబంధిత పోటీ పరీక్ష రాసే వరకు ప్రతి నెలా రూ.4000లు స్టైపండ్ కూడా చెల్లిస్తారు.
ఎవరు అర్హులు..
షెడ్యూల్డు కులాలు(SC), ఇతర వెనుకబడిన కులాలు (OBC) వర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రమే అర్హులు.
ఏయే పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తారంటే..
యూపీఎస్‌సీ నిర్వహించే గ్రూప్ ఏ, బీ పరీక్షలు
స్టాఫ్ సెలక్షన్ కమీషన్(ఎస్‌ఎస్‌సి) పరీక్షలు
రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలు
స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్లు నిర్వహించే గ్రూప్ ఏ, బీ పరీక్షలు
బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్వహించే ఆఫీసర్స్ గ్రేడ్ ఎగ్జామ్స్
జేఈఈ, నీట్, క్యాట్, వంటి ప్రొఫెషనల్ కోర్సులు
జీఆర్ఈ, ఐఈఎల్‌టీఎస్, టోఫెల్ వంటి
నేషనల్ డిఫెన్స్ ఎకాడెమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసులు మొ.వి. అలాగే, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నిర్ణయించే మరికొన్ని పరీక్షలు ఇందులో ఉన్నాయి.
విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలు..
ఈ పథకం కింద లబ్ది పొందాలంటే విద్యార్థి ఖచ్చితంగా ఇంటర్మీడియెట్, డిగ్రీ పరీక్షల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఇంటర్మీడియెట్ పూర్తయిన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు లేదా డిగ్రీ పూర్తయిన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ పథకానికి అర్హులు.
ఇంటర్మీడియెట్ అర్హతతో రాసే పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవాలనుకునే విద్యార్థులు ఈ పథకానికి ఎంపికయ్యే నాటికి వాటికి సంబంధించిన విద్యార్హత ధ్రువ పత్రాలను జతచేయాలి.
అలాగే, డిగ్రీ అర్హతతో రాసే పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోదలచిన విద్యార్థులు ఈ పథకానికి ఎంపికయ్యే నాటికి వాటికి సంబంధించిన విద్యార్హత ధ్రువ పత్రాలను జతచేయాలి.
విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షలకు మించకూడదు.
ధరఖాస్తు చేయు విధానం: ఆన్‌లైన్
ఎంపిక ప్రక్రియ:
మెరిట్ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు. అభ్యర్థుల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. ఈ పథకం కింద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ మే నెలలో జారీ చేస్తారు. ప్రతి ఏడాది మే 1 నుంచి మే 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తారు. కావున లబ్ది పొందాలనుకుంటున్న విద్యార్థులు మే 31 లోపు విద్యార్థులు దరఖాస్తు పక్రియను పుర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/Hu5S9VkL2QLGy9hznC8u9F
Telegram Group: https://t.me/apjobs9
Click Here to Apply FREE Coaching
0 comments:
Post a Comment