ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న విద్యార్థులకు అలర్ట్. డిగ్రీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) స్కాలర్‌షిప్స్ అందిస్తోంది.
రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ (Undergraduate Scholarship) ప్రోగ్రామ్ కింద 5,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ ప్రకటించింది. ప్రతిభగల విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ఈ స్కాలర్‌షిప్ ఉపయోగపడుతుంది. రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 2023 ఫిబ్రవరి 14 లోగా దరఖాస్తు చేయాలి. మరి ఈ స్కాలర్‌షిప్ విద్యార్హతలు, ఇతర వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ వివరాలివే
రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసే విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.15 లక్షల లోపే ఉండాలి. ఏదైనా విభాగంలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్స్ చదువుతూ ఉండాలి. డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ఎన్‌రోల్ అయి ఉండాలి. భారతీయ విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాలి. బాలికలు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైనవారికి కోర్సు పూర్తి చేసేవరకు రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. స్కాలర్‌షిప్‌తో పాటు వైబ్రంట్ అల్యూమ్నీ నెట్వర్క్‌లో భాగస్వాములవుతారు. తర్వాత కూడా ఉన్నత విద్య అభ్యసించడానికి కావాల్సిన సపోర్ట్ లభిస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు:
దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు మద్దతు ఇచ్చేందుకు ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది రిలయన్స్ ఫౌండేషన్. తమకు నచ్చిన ఏదైనా స్ట్రీమ్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. మొత్తం 5,000 మంది అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. డిగ్రీ ప్రోగ్రామ్ మొత్తానికి స్కాలర్‌షిప్ పొందొచ్చు.
దరఖాస్తు విధానం
విద్యార్థులు https://scholarships.reliancefoundation.org/UG_Scholarship.aspx వెబ్‌సైట్‌లో ఓపెన్ చేయాలి.
వివరాలన్నీ చదివిన తర్వాత Click Here to Apply పైన క్లిక్ చేయాలి.
పేరు, విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి సబ్మిట్ చేయాలి
ఎంపిక విధానం
యాప్టిట్యూడ్ టెస్ట్, ఫస్ట్ లెవెల్ సెలక్షన్, ఫైనల్ సెలక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. సమయం 60 నిమిషాలు. వర్బల్ ఎబిలిటీ, అనలిటికల్, లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 2023 మార్చిలో ఎంపికైనవారి జాబితాను ప్రకటిస్తారు. స్కాలర్‌షిప్‌కు 5,000 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు.
Reliance Scholarship Apply Link
0 comments:
Post a Comment