FCI Admit Card: ఎఫ్‌సీఐలో 5043 ఉద్యోగాల భర్తీ, పరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు (పాన్‌కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..) వెంటతీసుకెళ్లాలి.ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ గ్రేడ్-3 పరీక్ష అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న  అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2023, జనవరి 1, 7,14, 21, 29 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు (పాన్‌కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..) వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్‌కార్డులో అభ్యర్థుల వివరాల్లో ఏమైనా సందేహాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top