గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. గ్రామ మరియు వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.దీంతో ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ అలాగే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చట్టం తరహా లోనే సచివాలయ వ్యవస్థకు చట్టరూపం వచ్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఈ ఆర్డినెన్స్ కు చట్ట సభలు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. అంతేకాదు ఇవాళ కేబినెట్లో ఈ అంశంపై కీలక ప్రకటన కూడా రానుంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15, 004 సచివాలయాలు ఉండగా, అందులో 1.34 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
0 comments:
Post a Comment