నేటి మంత్రి గారి సమావేశంలో లేవనెత్తిన అంశాలు - ప్రతిస్పందనలు
1. బదిలీలు 2020 మున్సిపల్ మేర్జింగ్ స్కూల్స్ టీచర్లకు ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు ఓల్డ్ స్టేషన్ పాయింట్లకు ఆప్షన్ అయితే ఇచ్చారు కానీ పాయింట్స్ జనరేట్ కావడం లేదని తెలుపగా అప్లై చేసుకోండి డీఈఓ లాగిన్ లో కలుపుతారని తెలిపారు
2. పిఎస్ హెచ్ఎం సబ్జెక్టు కన్వర్షన్ ఆప్షన్ ఎనేబుల్ చేయమని కోరగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం జరిగింది.
3. స్కూల్ మ్యాపింగ్ జరిగి సర్ ప్లస్ గా ఉన్న టీచరు కు ప్రిఫరెన్షియల్ క్యాటగిరి పాయింట్లు, రీఅప్ పర్సన్ పాయింట్లు, ఓల్డ్ స్టేషన్ పాయింట్లు జనరేట్ కావడం లేదు అని తెలుపగా డీఈఓ కు అప్లై చేస్తే ఎడిట్ చేస్తారని తెలిపారు.
4. మేర్జింగ్తో సంబంధం లేకుండా సర్ప్లస్ అయిన ప్రతి ఉపాధ్యాయుడికి సీనియర్, జూనియర్ అని కాకుండా అందరికీ రీ-అప్పర్షన్ పాయింట్ల కేటాయించాలని కోరగా సమ్మతించడం జరిగినది.
5. ఎయిడెడ్ టీచర్లకు సీనియార్టీ, ఖాళీలను పరిగణించాలని కోరగా అవకాశం లేదన్నారు
6. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ట్రాన్స్ఫర్లు జరపాలని కోరగా మాన్యువల్ గా జరుపుతామని తెలిపారు
7. అప్ గ్రేడేషన్ స్కూల్స్ సర్ ప్లస్ టీచర్లకు, రోల్ 98 అబౌ, బిలో స్కూల్లోని సర్ ప్లస్ ఎస్ జి టి లకు స్కూల్ అసిస్టెంట్లకు అందరికీ పాయింట్స్ ఇవ్వాలని కోరగా ఇస్తామన్నారు
8. ఎన్సిసి స్కౌట్ అవకాశం లేదన్నారు
9.. గత నెలలో ప్రమోషన్ విల్లింగ్ ఇచ్చినవారు ఏ క్యాడర్లో అప్లై చేయాలో తెలపనగా అప్లికేషన్ పెట్టవలసిన అవసరం లేదన్నారు
10.మ్యాపింగ్ స్కూల్ పిఎస్ హెచ్ఎం కు రీ అప్పర్షన్ పాయింట్లు, ఓల్డ్ స్టేషన్ పాయింట్లు రావడం లేదని తెలుపగా ఎనేబుల్ చేయడం జరిగింది
11. ప్లస్ 2 స్కూళ్లకు పోస్ట్లు ఇవ్వాలని కోరగా బదిలీలు అనంతరం ఇస్తామన్నారు
12. 8 సంవత్సరాలు పూర్తయిన సస్పెండ్ అయినటువంటి ఉపాధ్యాయులు బదిలీలకు అప్లై చేసుకోవాలనా లేదా తెలుపమని కోరగా బదిలీల అనంతరం మిగిలి ఉన్న ఖాళీలకు పంపుతామని తెలిపారు
13. కేజీబీవీ సీఆర్టీ లకు spouse ఇచ్చారు. రెసిడెన్షియల్ వాళ్లకు కూడా ఇవ్వాలని కోరగా అవకాశం లేదని తెలపడం జరిగింది.
14. బదిలీలకు apply చేసే గడువు తేదీ పెంచుతారు
15. 2021 బదిలీల తర్వాత భర్తను కోల్పోయిన మహిళా టీచర్లకు widow కేటగిరీ క్రింద తీసుకుంటారు
16. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు అదనపు పాయింట్స్ ఇస్తారు
చర్చించిన బదిలీలేతర అంశాలు
అన్ని పాఠశాలల్లో ఇంటర్నెట్
8 వ. తరగతి వరకు Languages, Social, SCERT మరియు English, Maths, Sciences NCERT curriculum
9th నుండి NCERT Curriculum
మొత్తం 376 Titles 1st to 10 text books syllabus దీనికి అనుగుణంగా మార్పులు చేయనున్నట్లు చెప్పారు
Text books, Teachers work books,Student Self learning workbooks ఇవ్వనున్నారు
1 నుండి 5 వరకు పిల్లలకు పాఠశాలకు Smart Tv లు ఇస్తారు
6 నుండి 10 varaku Digital class rooms ఏర్పాటు చేస్తారు
8 వ తరగతి నుండి పిల్లలకు, ఉపాధ్యాయులకు Tabs ఇస్తారు
32000 Schools లో Digital platforms ఏర్పాటు
0 comments:
Post a Comment