కలికిరి సైనిక్ స్కూల్లో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించారు.గతంలో ప్రకటించిన ప్రకారం నవంబరు 30తో గడువు ముగిసింది. అఖిల భారత స్థాయిలో ఈ ప్రవేశ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. కొంతమంది అభ్యర్థుల నుంచి గడువు పొడిగించాలని వినతులు రావడంతో గరిష్ట సంఖ్యలో విద్యార్థులకు అవకాశం కల్పించడం కోసం డిసెంబరు 5 వరకూ గడువు పొడిగిస్తున్నట్లు ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పేర్కొంది. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా సమర్పించాలని, దరఖాస్తు రుసుం మాత్రం రాత్రి 11.50 లోగా ఆన్‌లైన్‌లోనే చెల్లించుకోవచ్చని ఎన్టీయే తెలిపింది. ఇంతకు మునుపు అప్‌లోడ్ చేసిన దరఖాస్తుల్లో ఏవైనా సవరణలు, దిద్దుబాట్లు ఉంటే సరిచేసుకోవడానికి ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లోనే ప్రత్యేక కరెక్షన్ విండో ద్వారా అవకాశమిస్తున్నట్లు ఎన్టీయే వివరించింది. ఇది వరకే దరఖాస్తుకు జత చేసిన పత్రాలలో కూడా ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటి స్థానంలో కొత్త డాక్యుమెంట్లు కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ముందు ప్రకటించినట్లుగానే జనవరి 8 ఆదివారం నాడు నిర్ణీత షెడ్యూలు ప్రకారం ప్రవేశ పరీక్షలునిర్వహించనున్నట్లు కూడా ఎన్టీఏ వివరించింది. ఈలోగా ఎన్‌టీఏ వెబ్‌సైటును కొత్త అప్‌డేట్స్ కోసం తరచూ సందర్శిస్తుండాలని ఇంకా ఏవైనా వివరాల కోసం ఎన్టీఏ హెల్ప్ డెస్క్ నెంబరు 011-4075 9000ను సంప్రదించాల్సిందిగా ఎన్టీఏ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరషర్ సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment