దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) వినియోగదారులకు అద్భుతమైన వార్త అందింది.పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై తన కస్టమర్లకు పూర్తి సమాచారం అందించేలా వాట్సాప్ సర్వీస్‌ను ఎల్‌ఐసీ ప్రారంభించింది. ఇకపై ప్రతీ చిన్న పనికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏజెంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఈ చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. ఎల్‌ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వాట్సాప్ సర్వీస్ ప్రారంభమైందంటూ శుక్రవారం ట్వీట్ చేశారు.
వాట్సాప్ నంబర్ ద్వారా అనేక సేవలు
వినియోగదారులు మొబైల్ ఫోన్ నుండి '8976862090'నంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ పంపితే చాలు.. క్లయింట్లు ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు
►ప్రీమియం బకాయి
► బోనస్ సమాచారం
► పాలసీ స్థితి
►లోన్ అర్హత కొటేషన్
►లోన్ రీపేమెంట్ కొటేషన్
►చెల్లించవలసిన రుణ వడ్డీ
► ప్రీమియం చెల్లింపు సర్టిఫికేట్
►ULIP-యూనిట్‌ల స్టేట్‌మెంట్
►LIC సర్వీస్ లింక్‌లు
►సేవలను ప్రారంభించడం/నిలిపివేయడం
కాగా ఎల్‌ఐసీ న్యూ జీవన్ అమర్, కొత్త టెక్-టర్మ్ అనే రెండు ప్లాన్‌లు ఇటీవలే పునఃప్రారంభం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం విడుదల చేసిన ఈ రెండు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను మళ్లీ లాంచ్ చేశామని ఎల్‌ఐసీ తెలిపింది. ఈ పాలసీలు ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
0 comments:
Post a Comment