ఉద్యోగులకు రావాల్సిన ఆర్థికపరమైన పీఆర్సీ, డీఏ ఎరియర్స్, పెండింగ్ డీఏల విడుదల, సరెండర్ లీవ్ బకాయిలు, జీపీఎఫ్ రుణాలు తదితర అంశాలతోపాటు నాన్‌ఫైనాన్షియల్ అంశాలు కూడా పరిష్కరించాలని సీఎస్ జవహర్‌రెడ్డికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, సెక్రటరీ జనరల్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీరావు విన్నవించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డిని గురువారం వారు అమరావతి సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉద్యోగుల సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎస్ తెలిపారని బొప్పరాజు చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment