ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు అప్లికేషన్ గడువు ఇప్పటికే పూర్తయినది జిల్లా విద్యాశాఖ అధికారి గారి కార్యాలయం పరిధిలో అప్లికేషన్లు అప్రూవల్ చేస్తున్నారు..... ప్రస్తుతానికి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ నందు నూతనంగా 3 లింకులు ఎనేబుల్ చేయడం జరిగింది అవి:
- Download Provisional Seniority List
- Register GrievanceK
- now the Status of Your Objectio
Seniorty Lists ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
ప్రస్తుతానికి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ నందు ఇంకా సీనియారిటీ లిస్టులు అందుబాటులో లేవు జిల్లా స్థాయిలో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత సీనియార్టీ లిస్టులు కమీషనర్ స్థాయిలో అప్లోడ్ చేయబడతాయి అప్పుడు మీ జిల్లాని ఎంపిక చేసుకుని, మీ క్యాటగిరీని ఎంపిక చేసుకుని సీనియార్టీ లిస్టు లు డౌన్లోడ్ చేసుకోవచ్చు....www.andhrateachers. In
Register Grievance ఎలా చేయాలి?
గ్రీవెన్స్ రిజిస్టర్ చేసే ఉపాధ్యాయులు ముందుగా మీ యొక్క ట్రెజర్ ఐడి నెంబరు మరియు ట్రాన్స్ఫర్ కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం వారు ప్రొవైడ్ చేసిన పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ కావలసి ఉంటుంది లాగానే అయిన తర్వాతSelect objection Type అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇందులో Spouse Category, PH Category, Rationalization, Station Seniority Points, Service Points , Preferential Category, Others ఆప్షన్ ఇవ్వడం జరిగింది వీటిలో మనం ఏ అంశాలలో గ్రీవెన్స్ నమోదు చేయాలో ఎంపిక చేసుకోవాలి
ఎంపిక చేసుకున్న తర్వాత ఆ గ్రీవెన్స్ కు సంబంధించిన విషయాలు నమోదు చేయాలి దానికి సంబంధించిన సపోర్ట్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తే డాక్యుమెంట్ jpg ఫార్మేట్ లో ఉండాలి. 100 kb కి మించకూడదు... అప్లోడ్ చేసిన తర్వాత రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి గ్రీవెన్స్ నమోదు చేయవచ్చు
Note: ఒక ఉపాధ్యాయుడు మూడు అబ్జెక్షన్లు మాత్రమే నమోదు చేయడానికి అవకాశం కలదు
Know the Status of Objection తెలుసుకునే విధానం:
మనం నమోదు చేసిన అబ్జెక్షన్ స్టేటస్ కూడా తెలుసుకునే అవకాశం కలదు తెలుసుకోవడానికి మరల మన ట్రెజరీ ఐడి నెంబర్ మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మన అబ్జెక్షన్ తెలుసుకునే అవకాశం కలదు
Download Transfer Seniority Lists
Know the Transfer Application Verification Status
0 comments:
Post a Comment