జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో వ్యక్తిగత చందాదా రులు దాచుకున్న డబ్బును చట్టాన్ని అనుసరించి రాష్ట్రప్రభుత్వాలు వెనక్కి తిరిగి తీసుకోలేవని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం స్పష్టం చేశారు. పాత పింఛను విధానం (ఓపీఎస్) పున రుద్ధరణ అంశంపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె స్పందించారు. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమం త్రులు ఎన్పీఎస్లోని ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మును వెనక్కి తిరిగి ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారని, చట్టప్రకారం ఆ అవకాశం లేదని వివరించారు. ఆ రెండు రాష్ట్రాల్లో ఓపీఎస్ ను పునరుద్ధరిస్తూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment