Indian Army Recruitment | భారతీయ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ లో మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 419 పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ జారీ

భారత ప్రభుత్వానికి చెందిన కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పని చేసే భారతీయ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ లో మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 419 పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఖాళీల భర్తీ కోరుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ కింద అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆర్మీ ఆర్డినెన్స్ బోర్డు వెల్లడించింది. మరి జీతమెంత? ఈ మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుకి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? వంటి వివరాలు మీ కోసం.



పోస్టు: మెటీరియల్ అసిస్టెంట్ 

మొత్తం ఖాళీలు: 419

కేటగిరీల వారీగా ఖాళీలు: 

యుఆర్: 171

ఈడబ్ల్యూఎస్: 42

ఓబీసీ: 113

ఎస్సీ: 62

ఎస్టీ: 31

ఎక్స్ సర్వీస్ మేన్: 41

మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్: 20

పీడబ్ల్యూబీడీ: 16

ప్రాంతాల వారీగా ఖాళీలు:

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్: 10

ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా: 120

జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్: 23

మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు: 32

రాజస్థాన్, గుజరాత్: 23

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్: 185

పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, సిక్కిం: 26 

జీతభత్యాలు: రూ. 29,200/- నుంచి రూ. 92,300/- వరకూ

అర్హతలు:

గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి లేదా మెటీరియల్ మేనేజ్మెంట్ లో డిప్లొమా చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. 

వయసు పరిమితి: 18 నుంచి 27 ఏళ్ల లోపు

వయసు సడలింపు:

ఎస్సీ/ఎస్టీ: 05 ఏళ్లు

ఓబీసీ: 03 ఏళ్లు 

పీడబ్ల్యూబీడీ (యుఆర్): 10 ఏళ్లు

పీడబ్ల్యూబీడీ (ఓబీసీ): 13 ఏళ్లు

పీడబ్ల్యూబీడీ (ఎస్సీ/ఎస్టీ): 15 ఏళ్లు

ఎక్స్ సర్వీస్ మేన్: 03 ఏళ్లు

శత్రువులతో పోరాడినప్పుడు కాల్పుల్లో దివ్యాంగులైన డిఫెన్స్ వారికి: 03 ఏళ్లు 

శత్రువులతో పోరాడినప్పుడు కాల్పుల్లో దివ్యాంగులైన డిఫెన్స్ వారికి(ఎస్సీ/ఎస్టీ): 08 ఏళ్లు 

కేంద్ర ప్రభుత్వ అధికారులకి: 40 ఏళ్లు

కేంద్ర ప్రభుత్వ అధికారులకి (ఎస్సీ/ఎస్టీ): 40 ఏళ్లు

భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకోని మహిళలు: 35 ఏళ్లు

భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకోని మహిళలు (ఎస్సీ/ఎస్టీ): 40 ఏళ్లు

మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్: 05 ఏళ్లు

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో 

దరఖాస్తు చివరి తేదీ: 12/11/2022

Online Application

Download Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top