CBA పరీక్షల నిర్వహణ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సూచనలు

 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సూచనలు 

పరీక్షలకు ముందు చేయవలసిన పనులు

1. మొదటగా మీ పాఠశాలలోని విద్యార్థుల యొక్క తరగతి వారీ లిస్టులను వారి child ID లతో తయారుచేసుకుని సిద్ధంగా ఉంచుకొనవలెను.

2. 28.10.2022 వ తేదీ MRC నుండి మీ పాఠశాలకు సంబంధించిన Variable OMR లను తీసుకొని సరి చూసుకొనవలెను. Variable OMR లు కేటాయించబడని విద్యార్థుల కొరకు Buffer OMR లను MRC వద్దనుండి 01.11.2022 తేదీ తీసుకొని విద్యార్థుల పేరు, child ID లను రాసుకొని సిద్ధముగా ఉంచుకొనవలెను.

పరీక్షల సమయంలో చేయవలసిన పనులు

3. 6 నుండి పదవ తరగతి విద్యార్థుల యొక్క ప్రశ్నాపత్రాలను ఏ రోజుకు ఆ రోజు MRC నుండి పరీక్షకు ఒక గంట ముందు తీసుకొని పాఠశాలకు రావలెను.

4. పరీక్షకు ముందు విద్యార్థులను క్రమంగా సరైన దూరములో కూర్చుండబెట్టి వారి వారి OMR లను వారికి అందజేయాలి, పేరు, child ID లు సరిపోయినవి/లేదు అని సరి చూసుకొనమని విద్యార్థులకు తెలియజేయాలి.

5. తరువాత ప్రశ్నాపత్రాలను అందజేయాలి. CBA పరీక్షా పత్రంలో రెండు రకముల ప్రశ్నలు ఉంటాయి

బహుళైచ్ఛిక ప్రశ్నలు - 2 నుండి 4 ఎంపికలు ఉంటాయి వాటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం. సరియైన ఎంపికను ప్రశ్నాపత్రం పై గుడ్ గుర్తించాలి మరియు OMR పై సరి అయిన వృత్తములో బబుల్ చేయాలి. 

ఎంపిక లేని ప్రశ్నలు - ఈ ప్రశ్నలకు జవాబులను ప్రశ్నాపత్రం పైనే రాయాలి ( ఓఎంఆర్ లపై గుర్తించవలసిన అవసరం లేదు) 

6. విద్యార్థులు OMR లపై బహుళైచ్ఛిక ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించాలని, ఎంపిక లేని ప్రశ్నలకు జవాబులను OMR పై రాయవలసిన అవసరం లేదని విద్యార్థులకు తెలియజేయాలి 

7. అన్ని తరగతుల వారికి ఏ సబ్జెక్ట్ పేపర్ కు అయినా పరీక్షా సమయం ఒక్క గంట మాత్రమే అనుమతించాలి.

8. ఒకే OMR పై అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బబుల్ ఉంటాయి కాబట్టి ఏ పరీక్షకు ఆ సబ్జెక్టుకు సంబంధించిన బబుల్స్ మాత్రమే విద్యార్థి నింపాలని తెలియజేయాలి, పర్యవేక్షించాలి

9. ప్రతిరోజూ పరీక్ష పూర్తైన వెంటనే విద్యార్ధులనుండి ప్రశ్నా పత్రంతో పాటు OMR షీట్ కూడా వెనుకకు తీసుకోవాలి.

10. ప్రతి విద్యార్థి యొక్క OMR ను పరిశీలించి, విద్యార్థి ఏదైనా ప్రశ్నకు ఎంపికను గుర్తించని చొ ఆ ప్రశ్నకు ఉపాధ్యాయుడు E అనే ఎంపికను bubble  చేయాలి.

11. ఒక్కొక్క విద్యార్థికి అన్ని పరీక్షలకు కలిపి ఒకే OMR షీట్ ఇవ్వబడుతుంది. కనుక ప్రతిరోజు అదే OMR ను ఇచ్చి ఆ సబ్జెక్టు నందు జవాబులను బబుల్ చేయించవలెను

12. 1, 2, 3 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: ఉపాధ్యాయుడు ప్రతి ప్రశ్నను గట్టిగా చదివి విద్యార్థులు ఆ ప్రశ్నకు జవాబును గుర్తించిన తర్వాత మరియొక ప్రశ్న ను గట్టిగా చదువుతూ విద్యార్థుల చే జవాబులను రాయించాలి. పరీక్ష అనంతరం విద్యార్థుల నుండి ప్రశ్నాపత్రం లను సేకరించి వారి OMR లపై ఉపాధ్యాయుడే విద్యార్థి యొక్క జవాబులను బబుల్ చేయాలి.

13. 4, 5 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: OMR లపై విద్యార్థులే జవాబులను గుర్తించాలి. తెలుగు ఇంగ్లీషు పరీక్షలలో ప్యాసేజ్ లను ఉపాధ్యాయుడు గట్టిగా చదివి వినిపించిన తరువాత విద్యార్థులు జవాబులను రాయాలని తెలియజేయాలి.

పరీక్షల అనంతరం చేయవలసిన పనులు

14. పరీక్షలు అన్ని పూర్తైన వెంటనే OMR షీట్స్ అన్నింటిని, తరగతి వారీగా వేరు వేరు పాలిథిన్ కవర్స్ నందు ఉంచి, అన్నింటిని కార్డు బోర్డు బాక్స్ నందు ప్యాక్ చేసి, మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయానికి ఐదవ తేదీ పంపాలి.

15. OMR షీట్స్ ను జిల్లా స్థాయిలో స్కాన్ చేయించడం జరుగుతుంది. OMR నందు విద్యార్థులు పొందిన మార్కుల వివరాలు పాఠశాలలకు తెలియజేయబడవు. అవి కేవలం విద్యార్థుల స్థాయిని అంచనావేసి భవిష్యత్తులో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇవ్వవలసిన శిక్షణా కార్యక్రమాల రూపకల్పనకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది.

16. CBA పరీక్షల అనంతరం ప్రతి తరగతి (1 నుండి 8 తరగతులకు మాత్రమే), ప్రతి సబ్జెక్టు నకు KEY విడుదల చేయబడుతుంది. దాని ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సేకరించిన జవాబులతో కూడిన ప్రశ్నా పత్రములలోని జవాబులను దిద్దాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు, నిర్ణీత సమయం లోపల CSE సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబులతో కూడిన ప్రశ్నా పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్థం భద్రపరచాలి.

17. విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి. తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో FA-I నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top