ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణలో మండల విద్యాశాఖ అధికారు లకు సహాయకారులుగా గ్రామీణ పేదరిక సంస్థ (సెర్ప్)లో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనే జర్లు (ఏపీఎం) వ్యవహరించనున్నారు. వి ద్యా శాఖ సూచన మేరకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఇటీ వల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నెలా పాఠ శాలల వారీగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఎంఈ వోలకు పూర్తిస్థాయి సహాయకారులుగా ఏపీ ఎంలు పనిచేస్తారు. నాడు - నేడు కార్యక్రమం కింద పాఠశాలలకు ప్రభుత్వం అందజేస్తున్న ఫర్నిచర్, పరికరాల నిర్వహణ, పర్యవేక్ష ణలోనూ సహకరిస్తారు. ఏపీఎంలు ఇక నుం చి జిల్లా స్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ లతో పాటు డీఈవో, రీజనల్ జాయింట్ డైరె క్టర్లు అప్పగించే ఏదైనా ఇతర పనులకు హాజ రు కావాల్సి ఉంటుంది. ఆయా అంశాలపై 662 మంది ఏపీఎంలకు ఇప్పటికే విశాఖప ట్నం, సామర్లకోట, బాపట్ల, శ్రీకాళహస్తి, అనంతపురం కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment