ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు....
RBI కొత్త మార్గదర్శకాల ప్రకారం మీ డబ్బును 48 గంటలలోపు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉంటుంది.డబ్బును తిరిగి పొందడంలో బ్యాంక్ సహాయం చేయకపోతే, కస్టమర్ bankingombudsman.rbi.org.i n లో ఫిర్యాదు చేయవచ్చు.పొరపాటున వేరే ఖాతాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసినట్లయితే, బ్యాంకుకు లేఖ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. అయితే, ఇందుకు కొంత ప్రాసెస్ ఉంటుంది. మీరు మీ ఖాతా నంబర్, ఖాతాదారు పేరు, డబ్బులు పంపిన నెంబర్, లావాదేవీ జరిపిన తేదీ, ఎంత మొత్తం డబ్బు ట్రాన్ఫర్ చేశారు.IFSC కోడ్, అనుకోకుండా లావాదేవీ జరిగిన ఖాతా నంబర్‌ను కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనాలి.
చట్టపరమైన ప్రక్రియ..
మీ డబ్బును తిరిగి పొందడానికి చట్టపరమైన మార్గం కూడా ఉంది. పొరపాటున ఎవరి ఖాతాలో డబ్బు బదిలీ చేయబడిందో, దానిని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే, అతనిపై కూడా కేసు నమోదు చేయవచ్చు. అయితే, డబ్బు తిరిగి చెల్లించని సందర్భంలో ఈ హక్కు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, లబ్ధిదారుని ఖాతా గురించి సరైన సమాచారాన్ని అందించడం లింకర్ బాధ్యత. ఏదైనా కారణం చేత, లింకర్ తప్పు చేస్తే, దానికి బ్యాంకు బాధ్యత వహించదు.*
0 comments:
Post a Comment