*ఉపాధ్యాయ బదిలీలపై సిఎం నిర్ణయం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో* ఉపాధ్యాయుల బదిలీల్లో గరిష్ట కాలపరిమితి ఎనిమిదేళ్లు ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయ బదిలీల్లో ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉపాధ్యాయుడు కచ్చితంగా బదిలీ కావాల్సి ఉంటుంది. అయితే పాఠశాల విద్యాశాఖ ఎనిమిదేళ్ల నిబంధనను ఐదేళ్లకు కుదించాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లకు సంబంధించిన ఫైల్ను కూడా సిఎంఒకు పంపింది. ఈ ఫైల్ను సిఎంఒ తిరస్కరించింది. ఎనిమిదేళ్ల విధానంలో ప్రతిపాదనలు పంపాలని పాఠశాల విద్యాశాఖను కోరింది. దీంతో మరలా గరిష్ట కాలపరిమితి ఎనిమిదేళ్లకు మార్చి విద్యాశాఖ మంత్రి ద్వారా పాఠశాల విద్యాశాఖ సిఎంఒకు పంపేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ఫైలు సిఎంఒ ఆమోదం తెలిపితే పాత పద్ధతిలోనే ఉపాధ్యాయ బదిలీలు జరిగే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment