తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీఎస్‌ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్రవ్యాప్తంగా వివిధ డిపోల్లో పని చేసేందుకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలచేసింది. అర్హత ఆసక్తి గ అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ అప్రెంటిస్ కాల వ్యవధి మూడేళ్లు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఏదైనా విభాగంలో బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం ఇలా..
ఈ అప్రెంటీస్ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు.. దరఖాస్తుల సమర్పణకు ముందు https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అదే వెబ్‌సైట్‌లో టీఎస్‌ఆర్టీసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్ ఐడీ ద్వారా అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులు సమర్పించాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే https://tsrtc.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అవుతుందని టీస్ ఆర్‌టీసీ తెలిపింది.
రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు:
హైదరాబాద్- 26
సికింద్రాబాద్- 18
మహబూబ్ నగర్- 14
మెదక్- 12
నల్గొండ- 12
రంగారెడ్డి- 12
ఆదిలాబాద్- 09
కరీంనగర్- 15
ఖమ్మం- 09
నిజామాబాద్- 09
వరంగల్- 14
ముఖ్య వివరాలు:
శిక్షణ వ్యవధి: మూడు సంవత్సరాలు
అర్హతలు: ఏదైనా విభాగంలో బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వేతనాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు మొదటి ఏడాది రూ.15,000.. రెండో ఏడాది రూ.16,000.. మూడో ఏడాది రూ.17,000 వరకూ స్టైపెండ్ చెల్లిస్తారు.
వయసు: 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://tsrtc.telangana.gov.in/
Download Complete Notification
0 comments:
Post a Comment