Jio Laptop: ఇప్పటి వరకు టెలికాం రంగంలో సంచలనాలను సృష్టించిన రిలయన్స్ జియో 5జీ సేవలను తాజాగా మెుదలు పెట్టింది. ఇదే తరుణంలో కేవలం రూ.15 వేలకే బడ్జెట్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేయనున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది.కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌ను JioBook అని పిలుస్తోంది.
దిగ్గజాలతో భాగస్వామ్యం..
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు సంబంధించిన JioBook కోసం గ్లోబల్ దిగ్గజాలైన Qualcomm, Microsoftతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఆర్మ్ లిమిటెడ్ సాంకేతికత ఆధారంగా కంప్యూటింగ్ చిప్‌లు, కొన్ని యాప్‌లకు Windows OS సపోర్ట్ అందిస్తుందని సమాచారం.
ల్యాప్‌టాప్ అందుబాటులోకి..
బడ్జెట్ ధరలో తీసుకొస్తున్న ల్యాప్‌టాప్ ఈ నెల నుంచి పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు వంటి ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. రానున్న మూడు ఇతర వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఇది జియో ఫోన్ మాదిరిగా పెద్ద విజయాన్ని సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు.
దేశీయంగా తయారీ..
JioBookను కాంట్రాక్ట్ ఫ్లెక్స్ సంస్థ జియో కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో తయారు చేస్తోంది. మార్చి నాటికి వేల సంఖ్యలో వీటిని విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. HP, Dell, Lenovo కంపెనీలు గత ఏడాది దేశంలో కోటి 48 లక్షల యూనిట్లను విక్రయించాయి. రిలయన్స్ చేస్తున్న ప్రయత్నం ద్వారా ల్యాప్‌టాప్ మార్కెట్ సెగ్మెంట్‌ను కనీసం 15% పెరుగుతుందని కౌంటర్‌పాయింట్ విశ్లేషకుడు తరుణ్ పాఠక్ అన్నారు.
సొంత OS..
దేశంలోకి రిలయన్స్ తీసుకొస్తున్న ల్యాప్‌టాప్స్ జియో సంస్థ సొంతంగా తయారు చేసిన .JioOS ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి వినియోగదారులు JioStore నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు . కార్యాలయంలోని కార్పొరేట్ ఉద్యోగుల కోసం టాబ్లెట్‌లకు ప్రత్యామ్నాయంగా జియో ల్యాప్‌టాప్‌ను కూడా పిచ్ చేస్తోంది.
0 comments:
Post a Comment