Indian Navy Recruitment 2022: భారత నౌకాదళం లో పోస్ట్ లు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

భారత నౌకాదళం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నేవీలో కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదికూడా రూ.56,100 ప్రారంభ జీతంతో షార్ట్‌ సెర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి డిగ్రీ, పీజీ, బీటెక్‌ విద్యార్హతలు కలిగిన ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


Indian Navy Recruitment 2022: భారత నౌకాదళం లో పోస్ట్ లు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం:21.10.22

 దరఖాస్తులు ముగింపు తేదీ:06.11.22

అందుకు సంబంధించిన పూర్తి వివరాలను joinindinannavy.gov.in అధికారకి వెబ్‌సైట్‌లో ప్రకటించారు. అయితే అసలు ఎవరు అర్హులు? ఏఏ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు? ఎంత జీతం ఇస్తారు? అసలు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ ఆర్టికల్ మీకోసం..

ఇండియన్‌ నేవీ ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

విద్యార్హతలు:

పోస్టులను బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి పోస్టుకు తగిన స్పెషలైజేషన్‌ చేసుండాలి. పోస్టుకు తగినట్లుగా బీఈ/బీటెక్/ఎంటెక్/పీజీ/ఎంసీఏ/ఎమ్మెస్సీ/బీకాం/ఎంఈ చేసుండాలి. లేదంటే తత్సమాన కోర్సుల్లో పాసై ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి వసయు 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అంతేకాకుండా ఆడ, మగ ఇద్దరూ కచ్చితంగా పెళ్లి కాని వారై(బ్యాచిలర్స్‌) ఉండాలి. ఎంపికైనా వారికి కేరళలోని భారత నౌకాదళ అకాడమీలో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చెప్పుకున్న విద్యార్హతల్లో చివరి సంవత్సరం చదువుతున్న వారుకూడా అప్లై చేసుకోవచ్చని తెలిపారు.

మొత్తం ఖాళీలు:

జనరల్ సర్వీస్‌                                     – 56
ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌                   – 05
నేవల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్       – 15
పైలెట్‌                                                    – 25
లాజిస్టిక్స్                                               – 20
ఎడ్యుకేషన్‌                                            – 12
ఇంజినీరింగ్‌                                          – 25
ఎలక్ట్రికల్                                               – 45
నేవల్ కన్‌స్ట్రక్టర్                                    – 14
మొత్తం                                              – 217


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top