గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన ఎస్‌ఓపీలను మరోసారి పరిశీలించి వాటిలో మార్పులు, చేర్పులు అవసరమైతే చేయండి. నెలకు కనీసం రెండు సచివాలయాలను ప్రభుత్వ విభాగాధిపతులు పర్యవేక్షించాలి. కలెక్టర్లు, జేసీలు ఎలా పర్యవేక్షణ చేస్తున్నారో కూడా పరిశీలన చేయాలి. వ్యవసాయం, విద్య, మహిళ శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాల్లో మనం ఖర్చు చేస్తున్నట్టుగా దేశంలో ఏ ప్రభుత్వంకూడా ఖర్చు చేయడంలేదు. అందుకనే ఓనర్‌షిప్ తీసుకుని వాటిని సమగ్రంగా పర్యవేక్షణ చేయాల్సి అవసరం ఉంది. ప్రగతి లక్ష్యాల సాధనపై ప్రతి నెల రోజులకోసారి వివరాలు నమోదు కావాలి. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను వాడుకోవాలి. పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా ఉండకూదు. డ్రాప్‌అవుట్స్ అన్న మాట ఎక్కడా వినిపించకూడదు. సచివాలయాల వారీగా, వాలంటీర్ల వారీగా పర్యవేక్షణ చేయాలి. ఎప్పటికప్పుడు దీనిపై దృష్టిపెట్టాలి. ఎక్కడైనా డ్రాప్‌అవుట్ జరిగిన ఘటన తెలిస్తే.. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరును పరిశీలించాలి. పిల్లలు ఎవరైనా వరుసగా 3 రోజులు స్కూలుకు రాకపోతే కచ్చితంగా మూడోరోజు ఇంటికివెళ్లి ఆరాతీయాలి. పిల్లలు స్కూలుకు రాకపోతే కచ్చితంగా ఎస్‌ఎంఎస్‌లు పంపాలి. ఇది కచ్చితంగా జరిగేలా చూడాలి. విద్యారంగంలో మనం చేపట్టిన సంస్కరణలు అన్నవి గొప్ప భవిష్యత్తు తరాలను అందిస్తాయి. ఇంగ్లిషుమీడియం సహా మనం తీసుకొచ్చిన అనేక సంస్కరణలు అమలుద్వారా పరిస్థితులను మార్చాలన్న మహాయజ్ఞాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఒక ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని అమలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. వీటి ఫలితాలు అన్నవి..మంచి భవిష్యత్తు తరాలుగా సమాజానికి అందుతాయి. ఇంగ్లిషు మాధ్యమానికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు నిరంతరం కథనాలు రాస్తున్నాయి. వారి పిల్లలు మాత్రం ఇంగ్లిషుమీడియంలో చదుకోవాలి, పేదవాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లిషు మీడియంలో చదవకూడదన్న వారి వైఖరిని పదేపదే బయటపెడుతున్నారు. పేదవాళ్ల పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో చదువులు అందకూడదన్నది వారి ధ్యేయంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వం చేపట్టిన యజ్ఞం కొనసాగుతుంది. స్కూళ్ల నిర్వహణలో ఉత్తమ విధానాలు పాటించడం ద్వారా నాణ్యమైన చదువులు ఉచితంగా అందుతాయి. దీనివల్ల చదువుల కోసం చేస్తున్న ఖర్చు భారం నుంచి ఆయా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి. అంతిమంగా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం నెరవేరుతుంది అని ఆయన పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌ఎస్ రావత్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
0 comments:
Post a Comment