𒊹︎︎︎ సిఎం వద్దే ఫైల్ పెండింగ్
𒊹︎︎︎ గరిష్ట కాలపరిమితిపై తేలని వైనం
☆ బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు.
☆ విద్యాసంవత్సరం ప్రారంభిం చేలోపు పూర్తిచేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది.
☆ బడులు తెరిచి మూడు నెలలు కావొస్తున్నా ఇప్పటికీ బదిలీలకు సంబంధించిన విధివిధానాలను ఇంకా తేల్చలేదు.
☆ ఇంకా రేపోమాపో.. అంటూ బదిలీలపై నాన్చుతూనే ఉంది.
☆ బదిలీల అంశం రేషనలైజేషన్ తో ముడిపడి ఉంది.
☆ రేషనలైజేషన్ కు సంబంధించిన ప్రక్రియ ఇంతవరకు పూర్తికాలేదు.
☆ దీనిని ఒక కొలిక్కి తీసుకొస్తామంటూ రోజురోజుకూ విద్యాశాఖ పొడిగించుకుంటూ పోతుంది.
☆ బదిలీల ఫైల్ మాత్రం విద్యాశాఖ మంత్రి నుంచి సిఎం వద్దకు వెళ్లి మూడు వారాలు గడుస్తోంది.
☆ ఇంతవరకు సిఎంఒ నుంచి ఈ ఫైల్కు క్లియరెన్స్ రాలేదు.
☆ సిఎం ఆమోదం తెలిపిన వెంటనే బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ సిద్ధంగా ఉంది.
☆ సోమవారం పాఠశాల విద్యాశాఖపై జరిపిన సమీక్షలో బదిలీలపై స్పష్టత వస్తుందనే ఆశతో ఉపాధ్యాయులంతా ఆశగా ఎదురుచూసినా ఫలితం లేకుండాపోయింది.
☆ అయితే గరిష్టకాల పరిమితి (లాంగ్ స్టాండ్) పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు.
☆ ఇప్పటి వరకు ఎనిమిదేళ్లు ఒకే పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు కచ్చితంగా బదిలీ కావాలనేది నిబంధన.
☆ బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసిన ఉపాధ్యాయులు అర్హులు.
☆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండు అంశాల్లోనూ మార్పులు చేయాలనే భావనతో ఉంది.
☆ ఎనిమిదేళ్ల గరిష్టకాల పరిమితిని ఐదేళ్లకు కుదిస్తామని ప్రకటించింది.
☆ కనిష్ట కాలపరిమితిని సున్నా సర్వీసుగా మారుస్తామని ప్రకటించింది.
☆ గరిష్టకాలపరిమితి అంశాన్ని ఉపాధ్యాయ సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.
☆ దీంతో ఈ అంశంపై ప్రభుత్వం కూడా తర్జనభర్జన పడుతోంది.
☆ దీంతో ఐదేళ్లు ఉంటుందా? ఎనిమిదేళ్లు ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది.
☆ బదిలీల ఫైల్కు త్వరగా క్లియరెన్స్ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సిఎంఒను ఇప్పటికే పలుసార్లు కోరినట్లు సమాచారం.
☆ 1.80. లక్షల మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉన్నారు.
☆ చివరిసారిగా 2020లో బదిలీలు జరిగాయి.
☆ ఈ బదిలీల్లో 74 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు.
☆ బదిలీలు జరిగితే పూర్తికావడానికి కనీసం నెల సమయం పడుతుంది.
☆ దసరా సెలవుల్లోపు బదిలీలు.
☆ పూర్తయితేనే విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
☆ విద్యాసంవత్సరం మధ్యలో జరిగితే బోధన విషయంలో పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
0 comments:
Post a Comment