ఉచిత నిర్బంద విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్ 1211) (C) అనుసరించి 2022-23 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1 వ తరగతిలో ఉచిత ప్రవేశాలు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
ఇందులో భాగంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన వారు (అనగా అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగులు) కోసం 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం మరియు బలహీన వర్గాలకు (బీసీ, మైనార్టీ, ఓసీ) చెందిన పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హత కలిగిన పిల్లలకు 1వ తరగతి విద్యార్థుల నమోదులో 25% సీట్లు కేటాయించి, 2022-23 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశం కల్పించడం జరుగుతుంది
ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ. 1,20,000/- గాను, పట్టణ ప్రాంతంలో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షికాదాయం రూ. 1,40,000/- గాను ప్రాతిపదికగా తీసుకొని వారి కుటుంబాల పిల్లలకు అర్హులుగా నిర్ణయించడమైనది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సదరు ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, 2009 లో 12 (1)(C) అమలుకు సంబంధించి ఆన్లైన్ లో 16.08.2022 నుంచి 26.08.2022 వరకు 1వ తరగతిలో ప్రవేశము కొరకు దరఖాస్తు నమోదు చేయుట కొరకు పాఠశాల విద్యాశాఖ వారు http://cse.ap.gov.in వెబ్సైటులో ఇచ్చిన సూచనల మరియు నిబంధనల ప్రకారము, ఎంపిక కాబడిన విద్యార్థుల జాబితా వివరములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో గల సంబధిత జిల్లా విద్యాశాఖాధికారుల ద్వారా సంబంధిత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యముం వారికి పంపించుట జరిగినది. సంబంధిత తలిదండ్రులకు/సంరక్షులు మొబైల్ ద్వారా సమాచారము ఇవ్వబడును. అందరు జిల్లా విద్యాశాఖాధికారులకు మరియు అదనపు పథక సమన్వయాధికారులకు అడ్మిషన్ సుమ చేయుటకు ఆదేశములు జారిచేయుట జరిగినది.
కావున, ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, 2009 లో 12 (1) C) అమలుకు సంబంధించి సంబంధిత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యముల వారు ఎంపిక కాబడిన విద్యార్ధులకు వారి తల్లి తండ్రులకు సరియగు రీతిలో సందేశములు పంపించి 05.09.2022 నుండి 12.09.2022 లోపుగా సంబంధిత పాఠశాలలో విద్యార్ధిని విద్యార్థుల ప్రవేశము జరుగునట్లు సత్వర చర్య తీసుకోవలసిందిగా కోరడమైనది. ఎవరైనను ఆయా తేదీలలో అడ్మిషన్ కాకపోయినచో, వారి అడ్మిషన్ అర్హత కోల్పోవుదురు. అడ్మిషన్ సమయములో పాఠశాల యాజమాన్యం ఎన్నిక కాబడిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించి అడ్మిషన్లను ధృవీకరించుకోవాల్సిందిగా సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేయడమైనది..
ఎంపిక కాబడిన విద్యార్ధుల జాబితా www.cse.ap.gov.in వెబ్ పోర్టల్ నందు వుంచడమైనది.
మరియు, అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యముల వారు. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం. 2009 లో 12 (1)(C) అమలు ద్వారా ప్రవేశము పొందిన అందరు విద్యార్ధులకు ప్రభుత్వం వారు కల్పించు సదుపాయములకు సమానముగా పాఠ్యపుస్తకములు, నోట్ పుస్తకములు యూనిఫారం. తదితరములు అన్నియు SOP ( Standard Operating Procedure) ను అనుసరించి తప్పక అనులు జరిగేటట్లు. చర్యలు తీసుకోవలసిందిగా కోరడమైనది.
0 comments:
Post a Comment