కామ్రేడ్స్! ఈరోజు యూటీఫ్ రాష్ట్ర నాయకత్వం విద్య జాయింట్ డైరెక్టర్ M. రామలింగం గారిని కలిసి వివిధ అంశాలకు సంబంధించి ప్రాతినిధ్యం చేసాము.
***MEO పోస్ట్ లపై
--679 నూతన MEO పోస్ట్ లను నియమించడానికి ఫైనాన్స్ వారు అనుమతి ఇచ్చారు. వీటిని PR టీచర్లు తో నియామకం చేస్తారు..ప్రస్తుతం ఖాళీగా ఉన్న 248 MEO పోస్ట్ లను Govt. వారితో పూర్తిచేస్తారు.
ఈ 2 రకాల పోస్టుల జాబ్ చార్ట్ GAD వారినుండి స్పష్ఠత వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.ఉమ్మడి సర్వీస్ రూల్ సమస్య కోర్టు లో వున్నదని,కోర్టు ఇచ్చే ఆదేశాలు ప్రకారం నడుచుకొంటామని తెలిపారు
@@ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రకారమే ఇచ్చే 2 MEO పోస్ట్ లను నియామకం చేయాలని, ఉపాధ్యాయులలో ఉన్న అపోహలను తొలిగించాలని స్పష్టం చేసాము.
***DYEO. పోస్టు లను సీనియారిటీ ప్రకారం లిస్ట్ లు తయారు చేశామని ,వారం లోపు నియమాలను పూర్తి చేస్తామని చెప్పారు.
@@అర్హత కలిగిన PR వారికి కూడా Dy EO ప్రమోషన్స్ ఇవ్వాలని కోరాము.
** రేషనలైజేషన్ కి సంబంధించి 5వేలు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను 3450 ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేశామని ,ఇక్కడ కావాల్సిన లేదా మిగులు పోస్టులను ఆగస్టు 31 నాటి రోలు ఆధారంగా నిర్థారించారు. ఈ ప్రక్రియ కూడా వెంటనే చేపట్టను న్నామని తెలిపారు. ఆగస్టు 31 నాటికి ఎన్రోల్మెంట్ ఉండి టెక్నికల్ గా ఆన్లైన్లో నమోదు కాని వారి విద్యార్థుల ఆధారంగా అవసరమైన చోట ఉపాధ్యాయులను డిప్యూటేషన్ చేస్తామని, మార్చి నెలలో జరగబోయే రేష్నలైజేషన్లో అక్కడ పోస్టులు మంజూరు చేస్తామని తెలిపారు.
@@@విలీన ప్రక్రియ కరెక్ట్ కాదని,తల్లిదండ్రులు ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని,GO 117 లో ఉపాధ్యాయ సంఘాలు చెప్పిన అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరాము.. ఈ విద్యాసంవత్సరం ఇంత గందరగోళం కావడానికి ప్రభుత్వ బాధ్యత వహించాలని చెప్పాం.
** 998 హెచ్ఎం పోస్టులకు, ₹4,500 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, 292 జూనియర్ కాలేజీలో PGT పోస్టులకు ఫైనాన్స్ అనుమతించిందని త్వరలో విధి విధానాలను రూపొందించి ప్రమోషన్ ప్రక్రియను కూడా చేపడతామని చెప్పారు.
** మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు డి డి ఓ పవర్స్ మరియు రెవెన్యూ మండలాల ఆధారంగా విజయవాడ ,విశాఖపట్నం నగరపాలక సంస్థలకు నలుగురు ఎంఈఓ లను, మిగిలిన నగరపాలక సంస్థలకు ఇద్దరు చొప్పున MEOలను నియమించడానికి చర్యలు తీసుకొంటునట్లు తెలియజేశారు.
**బదిలీలకు సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి గారి వద్ద ఉన్నదని అక్కడ నుంచి వచ్చిన వెంటనే బదిలీలు చేపడతామని తెలియజేశారు
.
** ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్స్, అలాగే హెడ్మాస్టర్ నుండి ఎంఈఓ పోస్టులకు విల్లింగ్ తీసుకుంటున్నామని, భవిష్యత్తులో ప్రమోషన్లు ఇచ్చే సందర్భంలో నాట్ విల్లింగ్ కూడా అవకాశం ఇస్తామని తెలియజేశారు.
** జేఎల్ డైట్ కాలేజీ లెక్చరర్ సార్ ప్రమోషన్లకు సంబంధించి కోర్టు తీర్పు ఆధారంగా నిర్ణయ0 చేస్తామని తెలిపారు.
వీటితో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించాము.
.
JD గారిని కలిసిన వారిలో యూటీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు N. వెంకటేశ్వర్లు, యూటీఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు K. శ్రీనివాసరావు, సహాధ్యక్షుడు K. సురేష్ కుమార్ ,రాష్ట్ర కార్యదర్శి B. లక్ష్మీ రాజా,A. కృష్ణసుందర రావు.. వున్నారు.
0 comments:
Post a Comment