కాంట్రిబ్యూటరీ పింఛను పథకం(సీపీఎస్) రద్దుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ససేమిరా అంటుండగా... మరోవైపు సీపీఎస్ ను రద్దు చేస్తున్న రాష్ట్రాల జాబితా క్రమంగా పెరుగుతోంది. తాజాగా సీపీఎస్ రద్దు జాబితాలో ఝార్ఖండ్ చేసింది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సీపీఎస్ ను రద్దు చేయగా.. సెప్టెంబరు నుంచి పాత పింఛను విధానాన్ని అమలు చేయనున్నట్లు ఝార్ఖండ్ ప్రకటించింది. ఎలాంటి హామీలు ఇవ్వని రాష్ట్రాలు రద్దు చేస్తుంటే.. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం జగన్ రద్దు చేయట్లేదని సీపీఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. 'మరోపక్క సీపీఎస్ అమలు చేయాలని రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఆర్థికశాఖ పంపిన లేఖలో సీపీఎస్కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించింది. దాని అమలుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని 10% నుంచి 14శాతానికి పెంచాలని ఆదేశించింది. ఉద్యోగసంఘాల నాయకులతో చర్చల సమయంలో సీపీఎస్ రద్దు చేస్తే కేంద్రం నట్లు, బోల్టులు బిగిస్తుందని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ లేఖ ఆధారంగానే పేర్కొని ఉంటారు' అని వారు తెలిపారు.
జార్ఖండ్ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసిన ఉత్తర్వులు కాపీ
0 comments:
Post a Comment