పదోతరగతి ప్రశ్నపత్రాల్లో క్యూఆర్ కోడ్ విధానం తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గత పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాలను బయటకు తీసిన కొన్ని నిమిషాల్లోనే సామాజిక మాధ్యమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఇలాంటివి పునరావృతం కాకుండా క్యూఆర్ కోడ్ విధానం తీసుకొస్తున్నారు. ఒక ప్రశ్నపత్రంలో మూడు, నాలుగు చోట్ల క్యూఆర్ కోడ్లను పెడతారు. ప్రశ్నపత్రం లీక్ అయినా, సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైనా ఎక్కడి నుంచి బయటకు వచ్చిందనే విషయం తెలిసిపోతుంది. వెంటనే ఆ పరీక్ష కేంద్రంలోని వారిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే వచ్చే మార్చిలో జరిగే పరీక్షల్లో క్యూఆర్ కోడ్ ఉన్న ప్రశ్నపత్రాలను విద్యార్థులకు ఇస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment