రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ. వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన అర్హులైన అభ్యర్థుల జాబితాను గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలో ఉదయం 10.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం 44.208 దరఖాస్తులొచ్చాయని, ఈ నెల 19 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అక్టోబర్ 12 నుంచి 15 వరకు కౌన్సెలింగ్ నిర్వహించి, 17 నుంచి తరగతులు ప్రారంభిస్తామని వివరించారు.
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని4 ట్రిపుల్ ఐటీలకు నిర్వహిస్తున్న అడ్మిషన్లలో భాగంగా స్థానిక ట్రిపుల్ ఐటీలో బుధవారం పలు కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను నిర్వహించారు. ఎన్సీసీ, స్పోర్ట్స్, వికలాంగుల, సైనిక ఉద్యోగుల పిల్లల కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు.30వ తేదీ వరకు పరిశీలన కొనసాగనుంది.
క్యాంపస్ వారిగా ఎంపిక అభ్యర్థులు జాబితా:
ఫలితాలు క్రింది లింకు ద్వారా పొందండి:
https://admissions22.rgukt.in/ind/phase1callletters.php
0 comments:
Post a Comment