ఇందుమూలంగా తెలియజేయడం ఏమనగా...
జగనన్న విద్యాకానుకలో భాగంగా సరఫరా చేయబడిన బ్యాగులు లోపభూయిష్టంగా ఉన్నందున మరియు నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వలన డ్యామేజ్ అయినటువంటి సదరు బ్యాగులు అన్నింటిని కూడా రీప్లేస్ చేసి వాటి స్థానంలో నాణ్యమైన కొత్త బ్యాగులు సరఫరా చేయవలసిందిగా సంబంధిత సరఫరాదారులకు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారు ఆదేశములు ఇచ్చియున్నారు.కావున, ప్రధానోపాధ్యాయులు అందరు కూడా జగనన్న విద్యాకానుక యాప్ లో ఏర్పాటు చేయబడిన బ్యాగుల రీప్లేస్ మెంట్ మాడ్యూల్ నందు ఆయా పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్ధులకు సరఫరా చేయబడి డ్యామేజ్ ఉన్న బ్యాగులు యొక్క వివరాలను సైజులు వారీగా నమోదు చేయవలసిందిగా ఆదేశించడమైనది.
ఈ కార్యక్రమం తేది 07.10.2022 లోగా పూర్తి చేయవలసిందిగా కోరడమైనది. నమోదు చేయబడిన వివరాలనుబట్టి బ్యాగులు రీప్లేస్ మెంట్ చేయడం జరుగుతుంది. కావున అందరు ప్రధానోపాద్యాయులు తప్పనిసరిగా ఈ వివరాలు వెంటనే నమోదు చేయవలసిందిగా కోరడమైనది. లేనియెడల బ్యాగులు రిప్లేస్ మెంట్ చేయడం సాధ్యపడదు. మరియు ఇందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment