మండల విద్యాశాఖ అధికారుల్లో (ఎంఈవో) ఒక రికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాల బాధ్యతలను అప్పగించాలని సీఎం జగన్ ఆదేశించారు. స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు కూడా భాగస్వాములు కాను న్నారు. వెల్ఫేర్-ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ప్రతివారం స్కూళ్లను సందర్శించనున్నారు. నెలకు ఒకసారి ఏఎన్ఎంలు సందర్శించనున్నారు. స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోలతో సహా సచివాలయ సిబ్బంది అప్లోడ్ చేయనున్నారు. అధికారులు వీటిపై వెం టనే తగిన చర్యలు తీసుకుంటారు. ఎవరెవరు ఏం చేయాలో నిర్దిష్టంగా ఎస్ వోపీలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment