ఈరోజు విద్యాశాఖ మంత్రి మరియు ఉన్నతాధికారులతో చర్చలు ముగిశాయి.
** ఉపాధ్యాయుల హాజరు డివైసెస్ ఇవ్వటం ద్వారా మాత్రమే వేస్తామని స్పష్టం చేశాం.
**ఆర్థిక పరిస్థితులు రీత్యా డివైసెస్ ప్రస్తుతానికి సప్లై చేయలేమని చెప్పారు.
**మీ సొంత ఫోన్ లో ఉన్న డేటా కి ఎలాంటి ఇబ్బంది లేదు అని, భద్రతకు భరోసా ఇస్తున్నామని చెప్పారు ..అలాగే జీతాలకు , లింకు ఉండదని, ఎటువంటి వేధింపు చర్యలు తీసుకోమనే విషయాన్ని తెలియజేశారు.
**మరో 15 రోజులు టెక్నికల్ సమస్యల పరిష్కారానికిగడువు ఇస్తామన్నారు.
**ఫేషియల్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే మరొకసారి తప్పక చర్చించుకుని పరిష్కారం చేస్తామని, కనుక ఉపాధ్యాయులు ఆందోళన చెందొద్దని తెలియజేశారు.
యాప్ ద్వారా హాజరు నమోదు చేయడం వల్ల సమస్య ఏర్పడితే
జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఉన్న ఏఎస్ఓ దృష్టికి తీసుకువెళ్లాలని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామని తెలియజేశారు.
****.ఏమైనా మరొక 15 రోజులు పాటు ఫేషియల్ యాప్ కు సంబంధించిన ఇబ్బంది పరిస్థితులను గమనించిన తర్వాత మన వైఖరిని తెలియజేస్తామని చెప్పాము కాబట్టి ఉపాధ్యాయులు జరిగిన చర్చల సారాంశాన్ని గమనం లోకి తీసుకొని అటెండెన్స్ నమోదు చేయడంలో ఎలాంటి ఆందోళనకి గురికావద్దని తెలియజేయడమైనది.
0 comments:
Post a Comment