2022-23 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్థులు అర్హులు. పరీక్ష రుసుము ఓ.సీ మరియు బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్ధులకు రూ.50/- దరఖాస్తులను ఆన్ లైను లో 30-09-2022 నుండి స్వీకరించబడును. ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 31-10-2022 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 31-10-2022. పరీక్ష రుసుమును SBI Collect ద్వారా మాత్రమే చెల్లించవలెను. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment