కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 4 శాతం డేర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను పెంచుతూ కేబినెట్ సభ్యులు నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 38శాతానికి చేరనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెరిగిపోతున్న ధరల కారణంగా డేర్‌నెస్ అలవెన్స్ పెంచుతూ మోదీ ప్రతిపాదించారు. మోదీ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ అలవెన్స్ పెరిగింది.
కేబినెట్ తాజా నిర్ణయంతో 47.68 లక్షల మంది ఉద్యోగులకు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. వీరితో పాటు సివిలియన్ ఎంప్లాయిస్, డిఫెన్స్ విభాగానికి చెందిన ఉద్యోగులు సైతం డీఏ అలవెన్స్‌ను పొందవచ్చు.
ఇక తాజాగా కేంద్రం పెంచిన ఈ డీఏ అలవెన్స్ జులై 1 నుంచి అమల్లోకి రానుంది. జులై 1 నుంచి ఉద్యోగులు తీసుకున్న శాలరీస్‌తో పాటు ఏరియస్ సైతం చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వీటితో పాటు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
0 comments:
Post a Comment