CPS రద్దు కోసం మాత్రమే ఆవిర్భవించిన సంఘం APCPSEA, ఇప్పటి వరకు CPS రద్దు కోసం చేసిన నిరసన కార్యక్రమాలన్నీ శాంతియుతంగా చేయడం జరిగింది. కార్యక్రమాలు అన్నిటికీ కూడా పోలీసువారి పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది. పోలీసువారి పర్మిషన్ లేకుండా ఈ ఏడు సంవత్సరాల లో ఒక్క నిరసన కార్యక్రమాన్ని కూడా APCPSEA జరపలేదు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమాల ద్వారానే 2017 లో సిపిఎస్ ఉద్యోగులకు 'అప్పటివరకు లేని "ఫ్యామిలీ పెన్షన్" మరియు "గ్రాట్యుటీ" లు సాధించుకున్నాం. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని ఘంటాపథంగా చెప్పడం వల్ల మేమంతా సిపిఎస్ రద్దు చేసిన మొదటి రాష్ట్రంగా మన రాష్ట్రం నిలబడుతుందని ఎంతో ఆశగా ఎదురు చూశాం. కానీ కమిటీలతో కాలయాపన చేయమని చెప్పిన వారు ఇప్పుడు కమిటీలు వేసి మూడు సంవత్సరాలుగా కాలయాపం చేస్తున్నారు. ఎటువంటి హామీ ఇవ్వని రాజస్థాన్ ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్ధరణ చేశారు. APCPSEA అధ్వర్యంలో సిపిఎస్ విధానం అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1 తేదీన శాంతియుతంగా నిరసన తెలియజేయడం 2016 నుండి ఆనవాయితీగా వస్తుంది. శాంతిభద్రతల దృశ్యా పోలీసు వారు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఈసారి ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మరలా సెప్టెంబర్ 2 వ తేదీన సెప్టెంబర్ 11 న శాంతియుతంగా విరసన తెలియజేయటానికి పరిమిషన్ కి అప్లై చేయడం కూడా జరిగింది. కానీ పోలీసు వారు ఇప్పుడు కూడా పర్మిషన్ నిరాకరించడం చాలా బాధాకరం. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసనలు తెలియజేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల దృశ్యా సెప్టెంబర్ 11 కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. సిపిఎస్ రద్దు కొరకు మా శాంతియుత పోరాటం సిపిఎస్ రద్దయ్యే వరకు కొనసాగుతుంది. మా శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పర్మిషన్ పొందటానికి మాకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తూ ఆ ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వారి మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి. లేని పక్షంలో ఈ శాంతియుత నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. మేము చేస్తున్న శాంతియుత ఉద్యమాలు ఎట్టి పరిస్థితులో ఆపేది లేదు. గాంధేయ మార్గంలో మా ఉద్యమాలు మరియు వాటికి అనుమతులు పొందటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం అని రాష్ట్ర అధ్యక్షా కార్యదర్శులు రొంగలి అప్పలరాజు. కరి పార్థ సారథిలు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment