WhatsApp: మరో కొత్త ఫీచర్... మీ వాట్సప్ నెంబర్ కనిపించకుండా హైడ్ చేయొచ్చు



యూజర్ల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగపడేలా ఫీచర్స్ (WhatsApp Features) రిలీజ్ చేస్తూ ఉంటుంది వాట్సప్. ఇప్పుడు వాట్సప్ యూజర్ల ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని మరో ఫీచర్ టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సప్ యూజర్లు తమ ఫోన్ నెంబర్‌ని కూడా హైడ్ చేయొచ్చు.  వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.22.17.23 లో ఈ ఫీచర్ ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు కూడా అందుబాటులోకి రాలేదు. వాట్సప్ అంతర్గతంగా ఈ ఫీచర్‌ని పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ టెస్ట్ చేసిన తర్వాత బీటా యూజర్లకు రిలీజ్ చేయనుంది. ఆ తర్వాత మిగతా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.వాట్సప్ గ్రూప్స్‌లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడం చాలా ఈజీ. అంతేకాదు... గ్రూప్‌లో ఉన్నవారి ఫోన్ నెంబర్లు కూడా తెలుస్తాయి. దీని వల్ల సదరు యూజర్ల ప్రైవసీకి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాట్సప్ లేటెస్ట్ ఫీచర్ రూపొందించింది. వాట్సప్ యూజర్లు కావాలనుకుంటే గ్రూప్‌లో తమ నెంబర్ కనిపించకుండా హైడ్ చేయొచ్చువాట్సప్ కమ్యూనిటీస్‌కు ఈ ఫీచర్ ఎక్స్‌క్లూజీవ్‌గా లభించనుంది. యూజర్ల ఫోన్ నెంబర్లు సెక్యూర్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సప్ అందించబోయే ప్రైవసీ ఫీచర్లలో ఇది కూడా ఒకటి. దీంతో పాటు లాగిన్ అప్రూవల్ పేరుతో మరో సెక్యూరిటీ ఫీచర్ రాబోతోంది. వాట్సప్ అకౌంట్ హ్యాక్ కాకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా మీ వాట్సప్ అకౌంట్ లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తే ఏ డివైజ్ నుంచి అకౌంట్ లాగిన్ చేసేందుకు ట్రై చేశారో ఆ వివరాలు మీకు తెలుస్తాయి. దీంతో పాటు మీరు కొందరు యూజర్లకు మీ ఆన్‌లైన్ స్టేటస్ కనిపించకుండా హైడ్ చేయవచ్చు. ఇక వాట్సప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను కూడా టెస్ట్ చేస్తోందని ఇటీవల వార్తలొచ్చాయి. వాట్సప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో గ్రూప్ అడ్మిన్లకు ఎవరి మెసేజ్‌నైనా డిలిట్ చేసే అధికారం లభిస్తోంది. వాట్సప్ గ్రూప్‌లో వచ్చే మెసేజెస్ ఒక్కోసారి గ్రూప్ సభ్యుల మధ్య అభిప్రాయబేధాలకు కారణం అవుతుంటాయికొన్నిసార్లు వాట్సప్ గ్రూప్స్‌లో వచ్చే మెసేజెస్ గ్రూప్ అడ్మిన్లను చిక్కుల్లో పడేస్తుంటాయి. వారిని జైలుకు కూడా పంపిస్తుంటాయి. అందుకే గ్రూప్ అడ్మిన్లకు వాట్సప్ గ్రూప్‌పై మరింత కంట్రోల్ తీసుకొచ్చేందుకు వాట్సప్ లేటెస్ట్‌గా ఈ ఫీచర్ రూపొందించింది. ఇప్పటికే ఈ ఫీచర్ బీటాటెస్టర్లకు అందుబాటులోకి వచ్చేసింది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top