UPI Charges: UPI యాప్స్ వినియోగం పెరగటంతో ప్రజలు దాదాపుగా డబ్బు వినియోగాన్ని తగ్గించారు. కనీసం రూ.10 చెల్లించాలన్నా యూపీఐ ద్వారానే డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు.

 UPI Charges: UPI యాప్స్ వినియోగం పెరగటంతో ప్రజలు దాదాపుగా డబ్బు వినియోగాన్ని తగ్గించారు. కనీసం రూ.10 చెల్లించాలన్నా యూపీఐ ద్వారానే డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు.గత కొన్ని నెలలుగా దేశంలో నగదు రహిత చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. అయితే ఈ తరుణంలో ప్రభుత్వం పిడుగులాంటి వార్త సామాన్యుల నెత్తిన వేయనుంది.

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లింపు వ్యవస్థల్లో భారీగా పెట్టుబడి పెట్టింది. అయితే వాటి నిర్వహణ వ్యయాన్ని తిరిగి పొందే అవకాశాలను ప్రస్తుతం పరిశీలిస్తోంది. డెబిట్ కార్డ్ లావాదేవీల కోసం ఇంటర్‌చేంజ్, తప్పనిసరి ప్రతి లావాదేవీ రుసుము విధించాలని యోచిస్తోంది. ఇదే సమయంలో యూపీఐ ట్రాన్సాక్షన్లపై కూడా ఛార్జీలను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని రిజర్వు బ్యాంక్ తన డిస్కషన్ పేపర్ లో కోరింది.

RTGS లావాదేవీలు..

ఆపరేటర్‌గా, ఆర్‌టిజిఎస్‌లో ఆర్‌బిఐ తన పెద్ద పెట్టుబడి, కార్యాచరణ ఖర్చుల వ్యయాన్ని తిరిగి పొందడాన్ని సమర్థించవచ్చని పేపర్ పేర్కొంది, ఎందుకంటే ఇందులో ప్రజాధనం ఖర్చు ఉంటుంది. RBI విధించిన ఛార్జీలు సంపాదన కోసం ఉద్దేశించినవి కావు. వీటిని ఎక్కువగా పెద్ద వ్యాపారులు, పెద్ద సంస్థలు వినియోగిస్తాయి కాబట్టి ఛార్జీల విధింపు సమంజసమైనని, ఉచితంగా సేవలను అందించాల్సిన అవసరం లేదని అంటోంది. NEFT, IMPS ఛార్జీల విషయంలోనూ రిజర్వుబ్యాంక్ ఇదే మాటపై ఉంది.

వ్యాపారి తగ్గింపు రేటు సమీక్ష..

డెబిట్ కార్డ్ లావాదేవీల కోసం MDR (వ్యాపారి తగ్గింపు రేటు) తగ్గింపును తప్పనిసరి చేయడానికి బదులుగా, చెల్లింపు సిస్టమ్ ప్రొవైడర్ల (PSPs) మధ్య ఛార్జీల పంపిణీకి సంబంధించి చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్లు (PSOలు) అనుసరించే పథకాన్ని సమీక్షించడం అవసరమని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. ఈ విషయంలో రెగ్యులేటింగ్ ఇంటర్‌చేంజ్ లేదా ప్రతి లావాదేవీ రుసుమును తప్పనిసరి చేయడం అనే ఎంపికలు ఉన్నాయి.

UPI..

రియల్ టైం నిధుల బదిలీ వ్యవస్థగా ఉన్న UPI.. IMPS లాంటిదని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. కాబట్టి, UPIలోని ఛార్జీలు ఫండ్ బదిలీ లావాదేవీల కోసం IMPSలో ఛార్జీల మాదిరిగానే ఉండాలని వాదించవచ్చని తెలుస్తోంది. అయితే.. బ్యాంకుల మధ్య సెటిల్మెంట్ వ్యవస్థను మరింత సులభతరం చేయాలని యోచిస్తున్నందున అది ఖర్చులను మరింతగా పెంచుతుందని తెలుస్తోంది. అయితే ఈ సేవలను ఉచితంగా అందించే ఆలోచనలో రిజర్వు బ్యాంక్ లేదని స్పష్టంగా తెలుస్తోంది.

ప్రజలు ఏం చేయవచ్చు..

నిజంగా డిజిటల్ చెల్లింపులకు ఛార్జీలు అమలులోకి వస్తే ప్రజలు క్రమంగా మళ్లీ ఫిజికల్ క్యాష్ వినియోగం వైపు మళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇదే గనుక జరిగితే కేంద్రం, రిజర్వు బ్యాంక్ ఏ ఉద్ధేశ్యంతో దీనిని అమలులోకి తెచ్చారో అది విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్కెట్లోకి మళ్లీ మనీ సర్యులేషన్ పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. మరి ఇది ఎంత వరకు అమలు జరుగుతుంది, ప్రజలు ఎలా తీసుకుంటారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top