IPPB: పోస్టాఫీసు వెళ్లకుండానే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్.. స్మార్ట్ఫోన్లో ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే

India Post Payments Bank: భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ పోస్టాఫీస్‌ బ్యాంకింగ్ సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఖాతాదారుల కోసం రకరకాల ఆఫర్లను, ఇన్వెస్టిమెంట్‌ ప్లాన్స్‌ తీసుకొస్తోంది ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌.

ఈ క్రమంలోనే వినియోగదారులను పెంచుకునే క్రమంలో టెక్నాలజీని సైతం వినియోగించుకుంటోంది. ఇంట్లోనే కూర్చొని పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో డిజిటల్‌ ఖాతా ఓపెన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క యాప్‌తోనే బ్యాంకింగ్‌ సేవలను పొందే అవకాశం కట్పించింది. పోస్టాఫీస్‌లో ఎంతో ప్రాముఖ్యత దక్కించుకున్న సుకన్య సమృద్ధి ఖాతా (SSA), పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి పథకాలకు యాప్‌ ద్వారానే నగదు చెల్లించుకోవచ్చు.

ఖాతా ఎలా ఓపెన్‌ చేసుకోవాలంటే..

* ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో IIPB యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* అనంతరం యాప్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ‘ఓపెన్‌ అకౌంట్‌’పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత పాన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి.

* ఆధార్‌తో కార్డ్‌తో లింక్‌ అయిన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయాలి.

* చివరిగా మీ అడ్రస్‌, నామీనితో పాటు ఇతర వివరాలను ఎంటర్‌ చేయగానే అకౌంట్‌ ఓపెన్‌ అవుతుంది.

ఉపయోగాలు ఏంటి..

ఈ ఖాతాను జీరో బ్యాలెన్స్‌తో ఓపెన్‌ చేయొచ్చు. అకౌంట్‌ ఓపెన్‌ చేసిన వారికి వర్చ్యువల్‌ కార్డును అందిస్తారు. యాప్‌ సహాయంతో బిల్లు చెల్లింపులు, రీచార్జ్‌లు చేసుకోవచ్చు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను ఉచితంగా పొందొచ్చు.

0 comments:

Post a Comment

Top