Employees Health Scheme(EHS) ఎంప్లాయీస్ హెల్త్ కార్డు (EHS) స్కీమ్ను కింద, EHS కార్డ్ పై నెట్వర్క్ ఆసుపత్రి వారు వైద్యం నిరాకరించకుండా ఉండేందుకు మరియు EHS స్కీం బలోపేతానికి, ఈ క్రింద తెలిపిన నిర్ణయాలను, *ఆర్ధిక శాఖ వారి ఆమోదంతో* ప్రభుత్వం ఆమోదిన్చి GO Ms. No. 203ను విడుదల చేయడమైనది.
👉 ఇప్పటివరకు EHS క్రింద కవర్ కాకుండా, ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతున్న 565- ప్రొసీజర్స్ అన్నిటినీ EHS కు కూడా వర్తించేవిధంగా ఉత్తర్వులు..
👉 ఇప్పటివరకు EHS కార్డ్ పై నెట్వర్క్ హాస్పిటల్ వారు వైద్యం చేస్తే, వారి బిల్లులు సకాలంలో payment జరగనందున ఆసుపత్రి వారు EHS కార్డ్ పై ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరిస్తున్నారు. కనుక, ఇప్పుడు EHS కార్డుపై ట్రీట్మెంట్ చేసుకున్న వాటికి అయ్యే బిల్ పేమెంట్స్ ను ఆరోగ్యశ్రీ payment మాదిరి, *21 రోజుల్లో Auto Debit Scheme ద్వారా EHS payments కూడా వెంటనే చెల్లించటానికి అంగీకరించారు.
👉 నెట్వర్క్ అసుపత్రులలో హెల్ప్ డెస్క్ లు, అక్కడ సేవలందిస్తున్న ఆరోగ్యమిత్ర వ్యవస్థను బలోపేతం చేస్తూ, ఆరోగ్య మిత్రలు EHS హోల్డర్స్ కు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ సహకరించే విధంగా చూస్తామని, అలాగే నెట్ వర్క్ హాస్పిటల్స్ కూడా ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని...
👉 ఆరోగ్యశ్రీ లో వలే, ఇతర రాష్ట్రాలలో కూడా EHS కార్డ్ పై ఉద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్,మరియు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ వైద్యం అందించే విధంగా ఉత్తర్వులు.
అలాగే నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యంతో - ఉద్యోగ సంఘాలను కలిపి సంయుక్తంగా వీలైనంత త్వరలో ఒక సమావేశాన్ని నిర్వహించాలని కోరడమైనది.
👉 ఈ సందర్భంగా వారు Prl. Secretary Sri MT కృష్ణ బాబు, IAS garu మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్ల్కు EHS కార్డ్ పై వైద్యం చేయించేందుకు అన్నీ రకాల చర్యలు చేపడతామని తెలిపారు.
👉 అలాగే ఇప్పటికే కాలపరిమితి (31.7.2022 వరకు మాత్రమే ఉంది) పూర్తైన ఎంప్లాయీస్ మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని మరొక సంవత్సరం పాటు అనగా 31.7.2023 వరకు కొనసాగించడానికి గౌ 11ముఖ్యమంత్రి గారి ఆమోదం కొరకు ఫైలు పంపినట్లు, వారి ఆమోదం పొందగానే ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు.
0 comments:
Post a Comment