రాష్ట్ర వ్యాప్తంగా 13లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు వేయికళ్లతో ఎదురుచూస్తున్న పాత పెన్షన్ పునరుద్ధరణ తప్ప ఎటువంటి ఇతర ప్రత్యామ్నాయం సిపిఎస్ జిపిఎస్ మాకొద్దని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్ మరియు హెచ్ తిమ్మన్న లు ప్రభుత్వానికి తెలియజేశారు. ఈరోజు తేదీ 18-08-2022 న వెలగపూడి సచివాలయము నందు మంత్రుల బృందంతో జరిగిన ఉద్యోగ సంఘాల చర్చల్లో రాష్ట్రోపాధ్యాయ సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మధ్యలో బొత్స సత్యనారాయణ గారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఐఏఎస్ అధికారులు ఏపీ జేఏసీ నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుని సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేసి హామీ ఇచ్చిన విధంగా 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల కుటుంబాలు ఎదురుచూస్తున్నటువంటి సందర్భంలో రెండు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఆశతో ముఖ్యమంత్రి గారి వైపు చూస్తున్నారని వారి కుటుంబాలు రోడ్డున పడకుండా సామాజిక భద్రత కల్పిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినటువంటి హామీని నిలబెట్టుకొని తక్షణం పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ తమకు సమ్మతం కాదని ఏ విధంగా అయితే రాజస్థాన్ ఛత్తీస్గడ్ పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో అమలవుతున్న విధంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని కోరారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ సిపిఎస్ వద్దు అన్నందు వల్లనే ప్రభుత్వము ఉద్యోగుల పట్ల సానుభూతితో ఉందని ఏదో ఒక పరిష్కారం కనుక్కోవడానికి రాజస్థాన్ ఛత్తీస్గడ్ రాష్ట్రాలలో అమలవుతున్న పాత పెన్షన్ విధానాన్ని స్టడీ చేయించామని తెలిపారు.దీంతోపాటు ఒకటి తొమ్మిది 2004 కంటే ముందు ఉద్యోగ నియామకానికి దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత కాలంలో అనేక కారణాలవల్ల ఆలస్యంగా చేరినటువంటి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు పోలీసు వారు ఇతర ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగా పాత పెన్షన్ అమలు చేయాలని అదేవిధంగా చనిపోయినటువంటి సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని వారి సందర్భంగా మంత్రుల కమిటీకి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా సెప్టెంబర్ ఒకటో తారీకు జరగబోయే సిపిఎస్ ఉద్యోగుల ఆందోళనలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటుందని తెలియజేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment