పేస్కేల్ విషయంలో ఏపీ ఉద్యోగులకు అన్యాయం : జేఏసీ నేత బొప్పరాజు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు పలు విషయాల్లో అన్యాయానికి గురవుతున్నారని ఏపీ జేఏసీ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారుముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పే స్కేల్, జీపీఎఫ్ అమలు విషయంపై స్పందించారు.
పే స్కేల్‌ను ఏ శాఖకు సంబంధించిన వారికి క్యాడర్ వారీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొవిడ్ సమయంలో మృతి చెందిన ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు, కార్మికుల కుటుంబ సభ్యులకు వన్‌టైమ్ సెటిల్ మెంట్ కింద తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని గతంలో అనేకసార్లు సీఎంకు విన్నవించామని తెలిపారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు కావడం లేదని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment