ఈరోజు ప్రభుత్వంతో ఫ్యాప్టో నాయకులు వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా నూతనంగా ప్రవేశపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్ గురించి మరియు వివిధ రకాల సమస్యల గురించి ఫ్యాప్టో నాయకత్వం పాఠశాల కమిషనర్ గారిని జెడి సర్వీసెస్ గారిని కలిసి చర్చించారు.
చర్చించిన అంశాలు:
ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ గారితో చర్చించిన దాన్లో యాప్లతో పాటు, మున్సిపల్ ఉపాధ్యాయుల జీతాల సమస్య ,ఎస్సార్లు అప్డేట్స్ సమస్య ,ఏరియర్లు సమస్యలను కూడా ప్రత్యేకించి యుటిఎఫ్ గా ప్రస్తావించాం . ఈనెల 20వ తారీకు లోపే మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు డి డి ఓ పవర్స్ ఇస్తామని, ఎలిమెంటరీ యూపీ పాఠశాలలకు స్థానిక ఎంఈఓ తోటి ,నగరపాలక సంస్థల్లో అర్బన్ డిప్యూటీ డి ఓ ల తోటి శాలరీస్ తో పాటు ఎస్సార్లకు సంబంధించి అన్ని అంశాలను పర్యవేక్షణకు ఇస్తామని చెప్పి స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment