బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఏటీఎం (ATM) ల నుంచి క్యాష్ విత్ డ్రా చేసే సమయంలో పడే ఛార్జీలపై క్లారిటీ ఇచ్చారు.ఖాతాదారులు నెలకు వారి సొంత బ్యాంక్ ఏటీఎంల నుంచి ఐదు సార్లు, ఇతర బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం లనుంచి మరో ఐదు సార్లు ఉచితంగా నగదును ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. అంటే ఖాతాదారులు నెలకు 10 ట్రాన్సాక్షన్లను ఏటీఎంల ద్వారా ఉచితంగా నిర్వహించుకోవచ్చన్నమాట. ఈ విషయాన్ని మంత్రి రాజ్యసభలో ఈ రోజు ప్రకటించారు. బ్యాంకుల నుంచి నగదును ఉపసంహరించే సమయంలో ఎలాంటి జీఎస్టీ (GST) ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
బ్యాంకుల నుంచి క్యాష్ విత్ డ్రా చేస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే.. చెక్ బుక్ లపై పన్నులు ఉంటాయన్న వార్తలపై సైతం ఆమె స్పష్టత ఇచ్చారు. ప్రింటర్ నుంచి బ్యాంకులు కొనుగోలు చేసే చెక్ బుక్ లపై జీఎస్టీ ఉంటుందన్నారు. అంతే కానీ.. వినియోగదారుల చెక్ బుక్ లపై మాత్రం పన్ను ఉండదని స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment