ఏపీఈఏపీ సెట్ (APEAPCET)2022 కౌన్సిలింగ్‌కు notification ను సెట్ కన్వీనర్ పోలా భాస్కర్ (Pola Bhaskar) విడుదల చేశారు. ఈ నెల 18న ఇంజినీరింగ్ (Engineering) కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.ఈ నెల 22 నుంచి 31 వరకూ ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు కట్టడానికి అనుమతించనున్నారు. 23 నుంచి 31 వరకూ ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 28 నుంచి వచ్చే 02వ తేదీ వరకూ ఆప్షన్‌ల ఎంపిక ప్రక్రయ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 3న ఆప్షన్‌ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 6 నుంచి 12 వరకూ ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఇంజనీరింగ్ కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment