పాఠశాల విద్యాశాఖలో వ్యవస్థీకృత సంస్కరణల అమల్లో భాగంగా టీచర్ల పోస్టుల స్థాయిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వివిధ స్థాయిల్లోని 2,342 ఉపాధ్యాయుల పోస్టులను మార్పిడి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు 4,421 ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)లుగా, 998 స్కూల్ అసిస్టెంట్లను గ్రేడ్-2 ప్రిన్సిపల్ పోస్టుకు అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 52 ప్రీ స్కూల్స్‌ను హైస్కూళ్లుగా మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యా సంస్కరణల అమలుకు కార్యచారణ చేపట్టినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment