Aadhaar Correction: మొబైల్ నెంబర్ లేకపోయినా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి ఇలా...

Aadhaar Correction: ప్రతి ఒక్కరికి ఆధార్‌ ముఖ్యమైన పత్రం. ఇది లేనిది ఏ పనులు జరగవు. భారత ప్రభుత్వానికి చెందిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా జారీ చేసే ఆధార్‌ కార్డుతో ఎన్నో ఉపయోగాలున్నాయి.ఆధార్ అనేది మన గుర్తింపు రుజువు. ఇది భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించడానికి అత్యంత ముఖ్యమైన పత్రం. పాస్‌పోర్ట్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర గుర్తింపు కార్డులకు ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. అయితే ఆధార్‌లో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్‌ మొబైల్‌ నెంబర్‌ తప్పనిసరి. ఇది లేకపోతే ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. ఇప్పుడు మొబైల్‌ నెంబర్‌ లేకుండానే అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లో 12 అంకెల ప్రత్యేక కోడ్ ఉంటుంది.

ఆధార్‌లో కూడా కొంత లోపం ఉంది. ఒక్కోసారి ప్రింట్‌లో పొరపాట్లు, కొన్ని సార్లు తప్పుడు సమాచారం ఇవ్వడంలో తప్పులు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు సులభమైన మార్గాలను అందించారు. ఈ మార్పు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ చేయవచ్చు. అందువల్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేని వ్యక్తులు ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి మార్పులు చేసుకోవచ్చు. OTP పొందడానికి మీరు ఆధార్‌లో ఎటువంటి మొబైల్ నంబర్‌ను నమోదు చేయనందున ఈ పని ఆఫ్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు.

అప్‌డేట్‌ చేసుకోండిలా..

☛ మీ సమీపంలోని ఉండే ఏదైనా ఆధార్ కేంద్రాన్ని సందర్శించండి. ఆధార్ కార్డ్ కరెక్షన్ ఫారమ్‌ను పూరించండి.

☛ ఫారమ్‌ను పూరించిన తర్వాత ఆధార్ కార్డ్ కాపీని, పాన్, ఇతర గుర్తింపు కార్డుల జిరాక్స్ కాపీలను జత చేయండి.

☛ ఆధార్ కేంద్రంలో ఇన్‌స్టాల్ చేయబడిన మెషీన్‌లో బయోమెట్రిక్ వివరాల ధృవీకరణను పొందండి. దీని కోసం మీరు బొటనవేలు ముద్ర, ఐరిష్‌ స్కాన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

☛ తర్వాత ఆధార్ సెంటర్ ఆపరేటర్ మీకు రసీదుని అందజేస్తారు. అలాగే అందులో మీ మొబైల్ నంబర్‌ను కూడా యాడ్‌ చేస్తారు. ఈ నెంబర్‌ 2 నుంచి 5 రోజుల్లో ఆధార్‌తో లింక్ చేయబడుతుంది.

☛ ఆఫ్‌లైన్‌లో చేసుకునేందుకు మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌ ఐడి అవసరం.

☛ మీకు కావాలంటే ఆన్‌లైన్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ ఉంటుంది. అంటే SSUP సహాయం తీసుకోవడం ద్వారా మీరు ఆధార్‌లో పుట్టిన తేదీని సరి చేసుకోవచ్చు. దీని కోసం కూడా OTP ధృవీకరణ అవసరం. మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసినప్పుడు మాత్రమే ఈ పని పూర్తి చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ ఆధార్‌తో నమోదు కాకపోతే మీరు ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top