ఈసారి కి మాత్రం 5 సంవత్సరాలకి తప్పనిసరి బదిలీ..
*తర్వాత బదిలీల నుంచి 8 సంవత్సరాలకు తప్పనిసరి బదిలీ ప్రామాణికం...
*గౌ౹౹ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మరోసారి స్పష్టం
ఉపాధ్యాయులందరికీ తప్పనిసరి బదిలీలు 8 సంవత్సరాల పూర్తయితే మాత్రమే బదిలీ చేసేవారు. కానీ నూతనంగా జిల్లాలు ఏర్పడటం వల్ల ఉపాధ్యాయులు వారికి కావాల్సిన జిల్లాలోకి బదిలీ కావటానికి అవకాశం అందరికీ లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటీవల ఉపాధ్యాయ సంఘలతో ప్రభుత్వం చర్చలు సమయంలో ఐదు సంవత్సరాలు పూర్తయిన ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. సంఘ నాయకులు 8 సంవత్సరాలు తప్పనిసరి బదిలీలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదు.
ఈరోజు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన కొందరు నాయకులు గౌ౹౹ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో ను మరియు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో బదిలీలపై కలిసినట్లు తెలుస్తున్నది. ఇందులో స్పష్టంగా నిర్బంధ బదిలీలు ఐదు సంవత్సరాలు ఈ ఒక్కసారి మాత్రమే అని స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. కారణం కొత్త జిల్లాలు ఏర్పాటు కారణంగా అందరూ ఏ జిల్లాలు వారు ఆ జిల్లాల చేరుకోవడానికి అవకాశం కల్పించామని మరల వచ్చే బదిలీల్లో 8 సంవత్సరాల లాంగ్ స్టాండింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. మరియు ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల గారు కూడా అదే స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై మరింత స్పష్టత కొరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎదురు చూడాల్సి ఉంది
0 comments:
Post a Comment