Minutes of WebEx meeting on 18.07.2022 with District Educational Officers,Additional Project Co-Ordinators by Hon'ble Special Chief Secretary, School Education Department, Amaravathi.



Minutes of WebEx meeting on 18.07.2022 with District Educational Officers,Additional Project Co-Ordinators by Hon'ble Special Chief Secretary, School Education Department, Amaravathi.

• జగనన్న విద్యా కానుక లో అన్ని అంశాలతో కూడిన కిట్టు ను మాత్రమే బయోమెట్రిక్ ద్వారా సరఫరా చేయాలి. 

• అనివార్య కారణాలవల్ల యూనిఫామ్ క్లాత్ మరియు బూట్లు లేట్ అయినవి, కాబట్టి ఆ రెండు మినహా మిగతా ఐటమ్స్ తో ఈనెల 25 లోపు పంపిణీ పూర్తి చేయాలి.

• ది. 25.07.2022 తర్వాత యూనిఫామ్ మరియు బూట్లు తో కలిపి జగనన్న విద్యా కానుక పూర్తిస్థాయిలో అందజేయాలి.

. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలలో పాఠశాల మేనేజ్మెంట్ గ్రాంట్ జమ కాని పాఠశాలల సంఖ్య అధికంగా ఉన్నది. వాని తాలూకు రూ.110 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి.ప్రధానోపాధ్యాయులు ది: 20.07.2022 లోపు పి ఎఫ్ ఎం ఎస్ ఖాతాలు తెరిచిన చో నిధులు వెంటనే సంబంధిత ఖాతాలలో జమ అవుతాయి.

* కావున ప్రధానోపాధ్యాయులు MRC షిబ్రలి యురియు సీఆర్పీ లతో సహకరించి మూడు దశల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పిఎస్ఎంఎస్ ఖాతాలు సిద్ధంగా ఉంచాలి. CFMS ఖాతాలు లేనిచో ఎట్టి పరిస్థితులలో నిధులు జమ కావు,

• "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" లో భాగంగా "హర్ ఘర్ కా జండా" కార్యక్రమం ఆగస్టు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరపవలెను.

• ఈ సందర్భంగా " విలేజ్ ప్రభాత్ భేరీ" అనే కార్యక్రమం ప్రతి గ్రామం, ఆవాస ప్రాంతంలో,పట్టణంలో నిర్వహించాలి. సంబంధిత ప్రాంత విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ విధిగా " విలేజ్ ప్రభాత్ భేరీ" లో పాల్గొనాలి. .

• వేకువజామున దేశభక్తి గీతాలు ఆలపిస్తూ వీధులలో ఊరేగింపుగా ప్రజలను చైతన్యపరచాలి. "అమృత్ సరోవర్" కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో 390 ప్రాంతాలు గుర్తించబడ్డాయి.సంబంధిత "అమృత్ సరోవర్" కార్యక్రమంలో పాఠశాల విద్యార్ధులు విధిగా పాల్గొనాలి. 

• Selfie With Flag జండా తో సెల్ఫీ ఫోటో దిగి "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" పోర్టల్ లో అప్ లోడ్ చేసినట్లయితే సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది సర్టిఫికెట్ ను విద్యార్ధిని విద్యార్థులు భద్రపరుచుకోవాలి.

ఆగస్టు 13, 14, 15 తేదీలలో ప్రతి ఇంటి మీద, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల మీద జాతీయ జెండా ఎగురవేయాలి.

. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ మన స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల గాథలను చేసుకోవాలి.

స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు సంబంధించిన కళారూపాలు, చిత్రాలు మొదలగునవి ప్రదర్శించాలి. • ప్రతి ఇంటా, ప్రతి వ్యక్తి, ప్రతి విద్యార్థి "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" కార్యక్రమాలలో పాల్గొనాలి. స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన కథలు, చిత్రాలు విరివిగా ప్రదర్శిస్తూ అందరినీ ఉత్తేజపరచాలి. "హర్ ఘర్ కా జండా" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top